ఐపీఎల్ 2021(IPL 2021 News) గ్రూప్ దశ చివరి అంకానికి చేరుకుంది. దీంతో ప్లే ఆఫ్స్(ipl 2021 playoff teams) రేసులో నిలిచే జట్లేవో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆప్స్‌కు వెళ్లాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం నాలుగు జట్లు పోటీపడుతుండగా.. అందులో కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్ ముందంజలో నిలిచాయి. ఈ నేపథ్యంలో నాలుగో స్థానం దక్కేందుకు ఏ జట్టుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూద్దాం.
కోల్‌కతా నైట్‌రైడర్స్
టాప్-4 స్థానానికి పోటీపడుతున్న జట్లలో ఎక్కువ అవకాశాలు ఉన్నవి కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే(kolkata knight riders 2021). ఈ జట్టుతో పాటు ముంబయికి ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు గెలిస్తే పాయింట్ల పరంగా సమానంగా నిలుస్తాయి. కానీ ముంబయి కంటే నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉన్న కేకేఆర్ ముందంజ వేస్తుంది. చివరి మ్యాచ్‌లో కోల్‌కతా రాజస్థాన్‌పై గెలిచినా.. ముంబయిని సన్‌రైజర్స్ ఓడించినా కేకేఆర్ టాప్-4కు వెళ్లడం దాదాపు ఖాయం. ఒకవేళ రాజస్థాన్‌పై కోల్‌కతా ఓడి.. సన్‌రైజర్స్‌పై ముంబయి భారీ తేడాతో గెలిస్తే ఈ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతవుతాయి.
ముంబయి ఇండియన్స్
ప్రస్తుతం పాయింట్ల పట్టిక(ipl 2021 points table)లో ఐదో స్థానంలో ఉంది ముంబయి ఇండియన్స్(mumbai indians team 2021). ఇప్పటివరకు నెట్‌రన్‌రేట్ పరంగా దారుణంగా వెనకపడిన ఈ జట్టు.. రాజస్థాన్‌పై భారీ విజయం సాధించి రన్‌రేట్ విషయంలో పంజాబ్, రాజస్థాన్‌ను దాటేసింది. ఇక దీని ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఈ జట్టు భారీ విజయం సాధించాలి. అలా కాకుండా రాజస్థాన్ చేతిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిపోయి.. సన్‌రైజర్స్‌పై ముంబయి గెలిస్తే ఈ జట్టు నేరుగా టాప్-4కు చేరుకుంటుంది.
పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్
పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు కూడా ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఒకవేళ రాజస్థాన్.. కోల్‌కతాను ఓడించి, ముంబయిపై సన్‌రైజర్స్, చెన్నైపై పంజాబ్ విజయం సాధిస్తే ఈ నాలుగు జట్ల మధ్య పాయింట్ల విషయంలో టై అవుతుంది. అపుడు నెట్ రన్‌రేట్ పరంగా ఉత్తమంగా ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ప్రస్తుతం రన్‌రేట్ విషయంలో కోల్‌కతా మెరుగ్గా ఉంది. ఆ తర్వాత ముంబయి, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయి. కావున ఇలా టై అయినా పంజాబ్, రాజస్థాన్‌కు టాప్-4కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండవనే చెప్పాలి.