ETV Bharat / sports

IPL 2021: ముంబయిని కోల్​కతా అడ్డుకోగలదా? - ipl second phase schedule 2021 live score

ఐపీఎల్​ రెండో దశలో మరో ఆసక్తి పోరుకు రంగం సిద్ధమైంది. ఆర్సీబీని చిత్తు చేసి జోరు మీదున్న కోల్​కతా((MI vs KKR 2021).. ముంబయి ఇండియన్స్​తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో ఇరు జట్లు గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. అబుదాబి వేదికగా జరిగే ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

MI vs KKR
ముంబయిX కేకేఆర్
author img

By

Published : Sep 23, 2021, 5:31 AM IST

ఐపీఎల్​ రెండో దశను విజయంతో ఆరంభించిన కోల్​కతా నైట్​ రైడర్స్​.. ముంబయి ఇండియన్స్​తో(MI vs KKR 2021) తలపడేందుకు సిద్ధమైంది. నేడు(సెప్టెంబరు 23) అబుదాబి వేదికగా ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ చేతిలో ఓడిన ముంబయి(MI vs CSK).. ఈ పోరులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉండగా.. కేకేఆర్​ కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని కసితో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దాం..

ముంబయికి విజయం దక్కేనా?

రెండో విడత తొలి మ్యాచ్​లో సీఎస్కే చేతిలో ఓడిన ముంబయి టీమ్​లో సారథి రోహిత్​ శర్మ(Rohit Sharma news), స్టార్​ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య లేని లోటు స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరభ్​ తివారి(50*) మినహా మిగతా బ్యాట్స్​మెన్​ విఫలమయ్యారు. అయితే కేకేఆర్​తో జరిగే మ్యాచ్​లోనూ రోహిత్​, హార్దిక్​ ఆడతారో లేదో స్పష్టత లేదు. హిట్​మ్యాన్​ అందుబాటులోకి వస్తాడని హెడ్​ కోచ్​ మహేళా జయవర్దనే చెప్పగా..ఆడే అవకాశం తక్కువని పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండా ముంబయి ఎలా ఆడుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్​ విషయానికొస్తే బుమ్రా, బౌల్ట్​, మిల్నే, చాహర్​తో పటిష్ఠంగానే ఉంది.

ఫామ్​లో కేకేఆర్​

తొలి దశలో పేలవమైన ప్రదర్శనతో చతికిలపడినా.. రెండో దశ ఆరంభంలోనే రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరును అలవోకగా ఓడించి ఘన విజయాన్ని అందుకుంది కోల్​కతా నైట్​ రైడర్స్​. ఆర్సీబీ పేలవ ప్రదర్శన ఈ విజయానికి ఓ కారణమని చెప్పాలి. ఆర్సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని.. మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఓపెనర్లుగా దిగిన శుభమన్​ గిల్,​ వెంకటేశ్​ అయ్యర్​ సునాయసంగా ఛేదించారు. బౌలింగ్​ విభాగంలోనూ వరుణ్​ చక్రవర్తి, ఫెర్గుసన్​, రసెల్​ అద్భుత ప్రదర్శన చేశారు. ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేశారు. ఈ ఓపెనర్లు. బౌలర్లు ఇదే ఫామ్​ను కొనసాగిస్తే ముంబయి జట్టును బలంగా అడ్డుకోవడానికి తోడ్పడుతుంది. ఏదేమైనప్పటికీ వీరి ఫామ్​కు మిగతా ఆటగాళ్ల సహకారం లభిస్తే ముంబయిని ఓడించొచ్చు.

అయితే ముంబయిపై కోల్​కతాకు చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్​లో ఇరు జట్లు 28 సార్లు తలపడగా.. ముంబయి 22 మ్యాచ్​ల్లో గెలిచింది. కోల్​కతా కేవలం 6 సార్లు మాత్రమే పైచేయి సాధించింది.

ఇదీ చదవండి:

'ఇక నుంచి 'బ్యాట్స్​మన్'​ కాదు 'బ్యాటర్' అని పిలవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.