ETV Bharat / sports

ముంబయి ఆలౌట్.. కోల్​కతా లక్ష్యం 153 - ipl news

చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతాకు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ముంబయి. రసెల్ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

MI VS KKR MATCH FIRST INNINGS
ముంబయి ఆలౌట్.. కోల్​కతా లక్ష్యం 153
author img

By

Published : Apr 13, 2021, 9:17 PM IST

Updated : Apr 13, 2021, 9:26 PM IST

కోల్​కతాతో మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ తడబడింది. 20 ఓవర్లలో152 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ 56 పరుగులు చేశాడు. కోల్​కతా తరఫున రసెల్ ఐదు వికెట్లు తీశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయికి.. ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ 2 పరుగులకే ఔటయ్యాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ శర్మతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే రెండో వికెట్​కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సూర్య పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత వరస విరామాల్లో ముంబయి వికెట్లు కోల్పోయింది. రోహిత్ 43, ఇషాన్ కిషన్ 1, హార్దిక్ పాండ్య 15, పొలార్డ్ 5, జేన్సన్ 0, రాహుల్ చాహర్ 8, కృనాల్ పాండ్య 15 పరుగులు చేశారు. కోల్​కతా బౌలర్లలో రసెల్ ఐదు వికెట్లు పడగొట్టగా, కమిన్స్ రెండు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, షకిబ్​ అల హాసన్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ తీశారు.

Last Updated : Apr 13, 2021, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.