ETV Bharat / sports

టాస్ గెలిచిన కోల్​కతా.. ముంబయి బ్యాటింగ్ - ముంబయి కోల్​కతా లేటెస్ట్ న్యూస్

ఐపీఎల్(IPL 2021 News)​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (సెప్టెంబర్ 23) ముంబయి ఇండియన్స్​తో కోల్​కతా నైట్​రైడర్స్(MI vs KKR 2021) తలపడనుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన కోల్​కతా బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2021
ఐపీఎల్​
author img

By

Published : Sep 23, 2021, 7:03 PM IST

Updated : Sep 23, 2021, 7:10 PM IST

ఐపీఎల్(IPL 2021 News)​ రెండో దశను విజయంతో ఆరంభించిన కోల్​కతా నైట్​ రైడర్స్​.. ముంబయి ఇండియన్స్​తో(MI vs KKR 2021) తలపడేందుకు సిద్ధమైంది. నేడు(సెప్టెంబరు 23) అబుదాబి వేదికగా ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ చేతిలో ఓడిన ముంబయి(MI vs CSK 2021).. ఈ పోరులో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉండగా.. కేకేఆర్​ కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని కసితో ఉంది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన కోల్​కతా బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్​కు దూరమైన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్​కు అందుబాటులోకి వచ్చాడు.

ఫేస్ టూ ఫేస్

ముంబయిపై కోల్​కతాకు చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్​లో ఇరు జట్లు 28 సార్లు తలపడగా.. ముంబయి 22 మ్యాచ్​ల్లో గెలిచింది. కోల్​కతా కేవలం 6 సార్లు మాత్రమే పైచేయి సాధించింది.

జట్లు

ముంబయి ఇండియన్స్

డికాక్, రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరభ్ తివారి, పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడం మిల్నే, రాహుల్ చాహర్, బుమ్రా, బౌల్ట్.

కోల్​కతా నైట్​రైడర్స్

గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రానా, మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్, రసెల్, సునీల్ నరేన్, ఫెర్గుసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిధ్ కృష్ణ

Last Updated : Sep 23, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.