కోల్‌కతాకు గొప్ప ఊరట. కీలక మ్యాచ్‌లో రాజస్థాన్‌పై భారీ విజయం సాధించింది. దీంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. టోర్నీలో కోల్‌కతా 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. కోల్‌కతా గెలుపుతో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ ఇంటి బాట పట్టాయి. హైదరాబాద్‌తో రేపు జరగనున్న మ్యాచ్‌లో 171 పరుగుల తేడాతో గెలిస్తేనే ముంబయికి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. లేకుంటే కోల్‌కతా నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌కి చేరినట్టే.
ఈ గెలుపుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ బెర్తు ఖరారైనట్లే! అయినా.. శుక్రవారం ముంబయి, హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్ తర్వాత ప్లేఆఫ్స్‌కు చేరుకున్న నాలుగో జట్టుపై స్పష్టత వస్తుంది. అయితే ఆ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు మరే అడ్డంకి లేదు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమన్ గిల్ (56) రాణించగా.. మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (38) ఫర్వాలేదనిపించాడు. నితీశ్ రాణా(12) పరుగులతో త్వరగా పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి (21) వేగంగా ఆడే క్రమంలో సకారియా వేసిన 17.1 బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దినేశ్ కార్తీక్(14), మోర్గాన్(13) నాటౌట్‌గా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్, సకారియా, రాహుల్ తెవాతియా, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి.. అదరగొట్టిన కోల్‌కతా.. రాజస్థాన్ లక్ష్యం 172