త్వరలో మొదలయ్యే ఐపీఎల్లో కేఎల్ రాహుల్‌లోని కొత్త కోణాన్ని చూస్తారని పంజాబ్ కింగ్స్ కోచ్ వసీమ్ జాఫర్ అన్నాడు. బ్యాటింగ్‌లో మరింత దూకుడు ప్రదర్శిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
యూఏఈలో జరిగిన గత సీజన్లో రాహుల్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు చేసి, ఆ సీజన్లో ఎక్కువ రన్స్ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అయితే ఇటీవల ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. 4 మ్యాచ్‌ల్లో కేవలం 15 పరుగులే చేసి నిరాశపరిచాడు.
"గత సీజన్లో జట్టు బాధ్యతల్ని తన భుజాన వేసుకుని, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేశాడు. ఈసారి మాత్రం తనలో కొత్త కోణాన్ని మీరు చూస్తారు. ఓ టీ20 సిరీస్‌లో విఫలమైనంత మాత్రాన అతడు చెడ్డ బ్యాట్స్‌మన్ అని అనరు. ఇలాంటి పరిస్థితి అందరూ ప్లేయర్లకు వస్తుంది" అని జాఫర్ అన్నాడు.
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్, తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఏప్రిల్ 12న ఆడనుంది.