ETV Bharat / sports

దిల్లీ x బెంగళూరు​: అగ్రస్థానం కోసం అమీతుమీ! - dc vs rcb preview

ఐపీఎల్​లో భాగంగా అహ్మదాబాద్​ వేదికగా నేడు దిల్లీ-బెంగళూరు మధ్య మ్యాచ్​ జరగనుంది. బలాబలాల పరంగా ఇరు జట్లు దాదాపు సమంగా ఉన్నాయి. ఇప్పటికే ఐదేసి మ్యాచ్​లాడిన ఇరుజట్లు నాలుగేసి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. మరి మంగళవారం జరిగే మ్యాచ్​లో గెలిచి.. ఎవరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్తారో చూడాలి. మ్యాచ్​ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

delhi vs bengalore, virat kohli, rishabh pant
దిల్లీ vs బెంగళూరు, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్
author img

By

Published : Apr 27, 2021, 6:42 AM IST

అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా దిల్లీ-బెంగళూరు మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. బలాబలాలలో ఇరు జట్లు దాదాపు సమానంగానే కనిపిస్తున్నాయి. ఐదు మ్యాచ్​ల్లో నాలుగేసి విజయాలతో ఉన్న రెండు జట్లకూ.. ఈ మ్యాచ్​ ముఖ్యమైనది. రెండింటికీ 8 పాయింట్ల చొప్పున ఉన్నప్పటికీ.. రన్​రేట్​ మెరుగ్గా ఉన్న కారణంగా ఆర్​సీబీ కంటే దిల్లీ ముందంజలో ఉంది. ఇవ్వాళ గెలిచిన జట్టు.. చెన్నైను దాటి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది.

ఆర్​సీబీ పుంజుకుంటుందా?

చివరగా చెన్నై​తో జరిగిన మ్యాచ్​లో ఏకంగా 69 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ సేన.. సీజన్​లో తొలి పరాజయాన్ని చవిచూసింది. 191 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్​సీబీ పూర్తిగా తడబాటుకు గురైంది. ప్రధాన బ్యాట్స్​మెన్​ కోహ్లీ, డివిలియర్స్​, మ్యాక్స్​వెల్​ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఓపెనర్​ దేవ్​దత్​ పడిక్కల్​ ధాటిగా ఆడినప్పటికీ.. ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. వీరంతా గత మ్యాచ్​ల్లో చూపిన పట్టుదలను ప్రదర్శిస్తే బెంగళూరుకు ఎదురుండదు.

బౌలింగ్​లోనూ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది ఆర్​సీబీ. టీమ్ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్​తో పాటు హర్షల్ పటేల్ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయడంలో సఫలమవుతున్నాడు. విదేశీ పేసర్​ జేమిసన్ ఈ జట్టుకు అదనపు బలం. అయితే గత మ్యాచ్​లో తొలుత బౌలింగ్​లో గొప్పగా రాణించిన కోహ్లీ సేన.. చివరి ఓవర్లో ఏకంగా 37 పరుగులు సమర్పించుకుంది.

ఇదీ చదవండి: 'అలా ఉండటం కష్టం.. ఒక్కడే మ్యాచ్​ లాగేసుకున్నాడు'

దిల్లీ విజయాలను కొనసాగిస్తుందా?

ఈ సీజన్​లో అత్యుత్తమంగా రాణిస్తున్న జట్లలో దిల్లీ ఒకటి. లీగ్ ఆరంభానికి ముందు పూర్తి స్థాయి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్​ గాయపడ్డప్పటికీ.. యువ సారథి పంత్​ టీమ్​ను బాగానే నడిపిస్తున్నాడు. సన్​రైజర్స్​తో సూపర్​ ఓవర్​కు దారి తీసిన గత మ్యాచ్​లో పంత్​ సేన గట్టెక్కింది. బ్యాటింగ్​లో టాపార్డర్​తో పాటు మిడిలార్డర్​ రాణిస్తోంది. పృథ్వీ షా, శిఖర్​ ధావన్, స్టీవ్ స్మిత్, స్టోయినిస్, లలిత్ యాదవ్, పంత్​లతో బ్యాటింగ్ ఆర్డర్​ దుర్భేద్యంగా ఉంది.

ఇక బౌలింగ్​లోనూ దిల్లీ సత్తా చాటుతోంది. అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్ పొదుపుగా బౌలింగ్​ చేస్తూ వికెట్లు తీస్తున్నారు. కగిసో రబాడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. వీరితో పాటు గత మ్యాచ్​లో రాణించిన అక్షర్​ పటేల్​ బౌలింగ్​లో అదనపు బలంగా కనిపిస్తున్నాడు. సొంత మైదానంలో అతడు ఏ మేర రాణిస్తాడో చూడాలి మరి.

ఇదీ చదవండి: భారత్​కు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ సంఘీభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.