కరోనా కారణంగా ఐపీఎల్(IPL 2021)లో వాయిదా పడిన మిగిలిన మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు ఇటీవలే బీసీసీఐ ఆమోదం తెలిపింది. యూఏఈ(IPL in UAE)లోని షార్జా, దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. దీని కోసం ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఇప్పుడు చర్చ నడుస్తోంది. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించేందుకు యూఏఈ ప్రభుత్వంతో బీసీసీఐ(BCCI) చర్చించనుందని తెలుస్తోంది.
ఓ ప్రముఖ క్రీడాఛానల్ వివరాల ప్రకారం.. భారత్ వేదికగా ఐపీఎల్ 2021లో జరిగిన మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించలేదు. కానీ, యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ రెండో దశ కోసం కనీసం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో అభిమానులను అనుమతించాలని యోచిస్తుంది. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వారికే టికెట్లు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ipl 2021: యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండో దశ