ETV Bharat / sports

'ఆరెంజ్​ జెర్సీలో వార్నర్​ కనిపించడం ఇదే చివరిసారి!'

ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టుకు కెప్టెన్​గా డేవిడ్ వార్నర్​ను తప్పించడంపై దక్షిణాఫ్రికా పేసర్​ డేల్​ స్టెయిన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్​.. ఆరెంజ్​ జెర్సీలో కనిపించడం ఇదే ఆఖరు అని అభిప్రాయపడ్డాడు.

author img

By

Published : May 3, 2021, 10:32 AM IST

dale steyn, comments on david warner
డేవిడ్ వార్నర్, దక్షిణాఫ్రికా బౌలర్

సన్​రైజర్స్​ రైజర్స్​ మాజీ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ భవితవ్యంపై దక్షిణాఫ్రికా పేసర్​ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్​ జెర్సీలో వార్నర్ కనిపించడం ఇదే చివరిసారి కావొచ్చని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్​ ఆడేముందు తుది జట్టు నిర్ణయంలో కెప్టెన్​ పాత్ర కూడా ఉండాలని స్పష్టం చేశాడు.

"నాకు తెలిసి డేవిడ్ వార్నర్​ ఆరెంజ్ జెర్సీలో కనిపించడం ఇదే చివరిసారి కావొచ్చు. ఆ ఫ్రాంఛైజీలో తెరవెనక ఏదో జరుగుతుంది. మనీశ్​ పాండేను జట్టులోకి తీసుకోకపోవడంపై ప్రశ్నిస్తే ఏకంగా కెప్టెన్సీతో పాటు తుది జట్టు నుంచి తప్పిస్తారా? అక్కడ అంతకుమించి వివాదమేదో ఉంది."

-డేల్ స్టెయిన్, దక్షిణాఫ్రికా​ బౌలర్​

"తుది జట్టు ఎంపికపై వార్నర్​​ ప్రశ్నించాడా? లేదా అనే విషయం నాకు తెలీదు. తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. రాజస్థాన్​తో మ్యాచ్​కు ఒక్కరోజు ముందు కేన్​కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. వార్నర్​ను తుది జట్టులోకి కూడా తీసుకోలేదు. మ్యాచ్​ సమయంలో అతడు డ్రింక్స్​ మోస్తూ కనిపించాడు. నాకు తెలిసి ఇకముందు హైదరాబాద్​ ఫ్రాంఛైజీతో అతడు కొనసాగకపోవచ్చు" అని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు.

ఇవీ చదవండి: భారత్​కు క్రికెట్ ఆస్ట్రేలియా విరాళం

'వార్నర్​ ప్రపంచ స్థాయి ఆటగాడు​.. త్వరలోనే జట్టులోకి..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.