ఐపీఎల్‌లో మరో 200 మ్యాచులు ఆడేస్తానని ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అన్నాడు. ఇప్పటికే 200 మ్యాచులు ఆడటం గొప్ప మైలురాయని చెప్పాడు. విజయవంతమైన జట్టుగా లీగులో తాము కొన్ని ప్రమాణాలు నెలకొల్పామని, ఫిట్‌గా ఉండేందుకు ఎంతో శ్రమిస్తున్నానని తెలిపాడు. కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు ఈ వ్యాఖ్యలు చేశాడు.
'పిక్క, తొడ కండరాల గాయాలు కాకుండా చాలా శ్రమిస్తున్నా. మూడు, నాలుగు నెలలుగా నా దేహం దిగువ భాగాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఎందుకంటే గతేడాది ఐపీఎల్‌లో నేను గాయపడ్డాను. ఫిట్‌నెస్ కొనసాగించేందుకు చాలా చేయాల్సి వస్తోంది' అని రోహిత్ చెప్పాడు. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఓటమి తర్వాత సమష్టిగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించామని తెలిపాడు. గెలుపోటములను తాము పట్టించుకోమని వెల్లడించాడు. చక్కగా సన్నద్ధమవ్వడమే తమకు అత్యంత కీలకమని స్పష్టం చేశాడు.
-
Captain's Corner is 🔙 💙
— Mumbai Indians (@mipaltan) April 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
📹 | Ro talks about the team preparations, his fitness regime and more in this season's first episode 😎#OneFamily #MumbaiIndians #MI #IPL2021 #KKRvMI #KhelTakaTak @ImRo45 pic.twitter.com/BslpHSKcrc
">Captain's Corner is 🔙 💙
— Mumbai Indians (@mipaltan) April 13, 2021
📹 | Ro talks about the team preparations, his fitness regime and more in this season's first episode 😎#OneFamily #MumbaiIndians #MI #IPL2021 #KKRvMI #KhelTakaTak @ImRo45 pic.twitter.com/BslpHSKcrcCaptain's Corner is 🔙 💙
— Mumbai Indians (@mipaltan) April 13, 2021
📹 | Ro talks about the team preparations, his fitness regime and more in this season's first episode 😎#OneFamily #MumbaiIndians #MI #IPL2021 #KKRvMI #KhelTakaTak @ImRo45 pic.twitter.com/BslpHSKcrc
'తొలి మ్యాచ్‌లో ఆడిన కొందరు పేసర్లు, కసరత్తుల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ముంబయి గర్వపడేది ఈ విషయంలోనే. మన అదనపు కృషే ఫలితాలను అనుకూలంగా మారుస్తుంది. ఫిట్‌నెస్ డ్రిల్స్, సమావేశాలు.. ఇంకేదైనా కానివ్వండి.. అందరం కలిసే పాల్గొంటాం. అప్పుడే అందరూ కలిసి మ్యాచ్ గురించి అభిప్రాయాలు పంచుకోగలరు. జట్టు సభ్యుల మధ్య అనుబంధమూ పెరుగుతుంది' అని రోహిత్ తెలిపాడు.
ఏటా కొత్త ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ముంబయి ఇండియన్స్‌లో చేరతారని హిట్‌మ్యాన్ అన్నాడు. వారంతా ముంబయి సంస్కృతిలో కలిసిపోవాలని సూచించాడు. బృందతత్వం ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ఎప్పట్నుంచో దానిని కొనసాగిస్తున్నామని వెల్లడించాడు. ఈ ఏడాదీ సొంత మైదానం ప్రయోజనం లేకపోవడం వల్ల సరికొత్త వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని అన్నాడు. తమ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో తెలుసని చెప్పాడు.