ETV Bharat / sports

ఐపీఎల్​ బోర్ కొడుతోందా? అందుకే రేటింగ్స్​ పడిపోయాయా?

author img

By

Published : Apr 12, 2022, 12:54 PM IST

IPL ratings dropped: ప్రతి ఏటా క్రికెట్​ ప్రియుల్లో జోష్​ నింపే ఐపీఎల్​.. ఈ సారి కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఈ సారి మెగాలీగ్​ టీవీ రేటింగ్స్​ కూడా తక్కువగా నమోదయ్యాయి. దీనికి కారణాలేంటో తెలుసుకుందాం..

IPL
IPL 2022

IPL ratings dropped: ఏటా క్రికెట్ అభిమానులకు అమితమైన వినోదాన్ని అందించే ఐపీఎల్​.. ఈ సీజన్​లో కాస్త నిరాశపరిచినట్లు కనిపిస్తోంది. అందుకు మొదటి వారంలో పడిపోయిన టీవీ రేటింగ్స్​ నిదర్శనం. బీసీసీఐకి షాక్​ ఇస్తూ గతేడాదితో పోలిస్తే.. ఐపీఎల్​ 2022 మొదటి వారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్‌ నివేదిక ప్రకారం.. నిరుడు తొలి 8 మ్యాచ్‌లకు 3.75 టీవీ రేటింగ్‌ లభించగా.. ఈసారి ఆ సంఖ్య 2.52కే పరిమితమైంది. 2020లో తొలి వారం మ్యాచ్‌లకు 3.85 టీవీ రేటింగ్‌ వచ్చింది. 2023-2027 ప్రసార హక్కులకు భారీ మొత్తం బిడ్డింగ్‌ వస్తుందని ఆశిస్తున్న బీసీసీఐకి ఇది మింగుడుపడని పరిణామమే. అయితే ఐపీఎల్​ 2020, 2021 సీజన్​లను దిగ్విజయంగా నిర్వహించిన బీసీసీఐ ఇలాంటి పరిణామం ఎదుర్కోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే...

  • ఐపీఎల్ ప్రారంభానికి ముందు టోర్నీ గురించి పెద్దగా ప్రచారం లేకపోవడం రేటింగ్స్​పై ప్రభావం చూపి ఉండొచ్చు!
  • టోర్నీ ఆరంభానికి ముందే ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించడం, మీడియా మొత్తం దానిపైనే దృష్టిసారించడం వల్ల లీగ్​కు పెద్దగా ప్రాచుర్యం లభించలేదు.
  • గతేడాది కరోనా భయాలతో ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. దీంతో టీవీ రేటింగ్స్​ బాగా పెరిగాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు మెరుగవడం వల్ల తిరిగి ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇది కూడా రేటింగ్స్​ పడిపోవడానికి ఓ కారణం.
  • అడపాదడపా మినహా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​లు కూడా ఏమంత రసవత్తరంగా లేకపోవడమూ కారణమే.
  • 10 జట్లతో టోర్నీని నిర్వహించడం వల్ల లీగ్​ చాలా సుదీర్ఘంగా జరుగుతుందనే భావన కలగడం.
  • రైనా, ఏబీ డివిలియర్స్ వంటి పలువురు ఆటగాళ్లు దూరమవడం
  • ఏప్రిల్ 6 వరకు ఆస్ట్రేలియా స్టార్​ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం
  • చెన్నై, ముంబయి, బెంగళూరు వంటి జట్లలో కీలకంగా ఉన్న ఆటగాళ్లు మెగావేలం కారణంగా ఇతర జట్లలోకి వెళ్లడం కూడా అభిమానులను నిరాశపరిచింది.
  • ధోనీ, కోహ్లీ కెప్టెన్లుగా లేకపోవడం
  • ఐపీఎల్​లో చెన్నైసూపర్​ కింగ్స్​, ముంబయి ఇండియన్స్​ జట్లకు అశేష అభిమానగణం ఉంది. అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్లు కూడా అవే. కానీ అందరి అంచనాలకు భిన్నంగా లీగ్​లో ఈ రెండు జట్లు ఆడిన నాలుగు మ్యాచ్​ల్లోనూ ఓడిపోవడం.
  • ఐపీఎల్ 2022 సీజన్​ మార్చి 26న ప్రారంభం కాగ, దానికి ఒకరోజు ముందే.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైంది. సినిమాకు మంచి రెస్పాన్స్​ రావడం వల్ల జనాలు థియేటర్లకు క్యూ కట్టడం ఐపీఎల్ వీక్షణలపై ప్రభావం చూపి ఉండొచ్చు.

ఇదీ చూడండి: సన్​రైజర్స్​కు భారీ ఎదురుదెబ్బ.. కీలక ప్లేయర్​కు గాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.