ETV Bharat / sports

ఐపీఎల్: అయ్య బాబోయ్.. మేం ఆడలేం! - లివింగ్​స్టన్​ వార్తలు

క్రికెట్​ అభిమానులతో పాటు క్రికెటర్లూ ఎక్కువ ప్రాధాన్యమిచ్చే టోర్నీ ఐపీఎల్. ఈ లీగ్​ ద్వారా ఎక్కువ పారితోషికం అందుకోవచ్చనే కారణంగా ప్రతి విదేశీ క్రికెటర్​ ఇందులో ఆడేందుకు ఆసక్తి చూపుతారు. కానీ, భారత్​లో ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం కారణంగా అనేక మంది విదేశీ క్రికెటర్లు లీగ్​ నుంచి తప్పుకొన్నారు. అలా ఈ ఏడాది టోర్నీ నుంచి వైదొలిగిన విదేశీ ప్లేయర్లు ఎవరో తెలుసుకుందాం.

Foreign cricketers who gave up crores of rupees in IPL for fear of corona virus
ఐపీఎల్​లో రూ.కోట్లు వదులుకున్న క్రికెటర్లు
author img

By

Published : Apr 29, 2021, 9:45 AM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) అంటేనే క్రికెటర్లకు అక్షయపాత్ర లాంటిది. వేలంలో కోట్ల రూపాయలు దక్కించుకోవడం సహా మ్యాచ్​లో అద్భుత ప్రదర్శనకు ప్రైజ్​లు అందుకుంటారు. రెండు నెలల తక్కువ సమయంలోనే అంతటి పారితోషికం అందుకోవడం అంటే మాములు విషయమా! అందుకే ప్రతి ఒక్క క్రికెటర్​ తప్పకుండా ఐపీఎల్​లో ఆడడానికి ఇష్టపడతాడు.

అయితే కొన్ని నెలలుగా బయోబబుల్​లో గడుపుతున్న క్రికెటర్లతో పాటు భారత్​లో ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభానికి భయపడి మరికొందరు ఈ ఐపీఎల్​ నుంచి తప్పుకొంటున్నారు. కరోనా భయంతో ఇప్పటికే టీమ్ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్ సహా ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆండ్రూ టై, కేన్ రిచర్డ్​సన్, ఆడం జంపా టోర్నీ నుంచి వైదొలిగారు. ఇలా అనేక కారణాలతో లీగ్ నుంచి తప్పుకొని కోట్ల రూపాయాలను వదులుకున్న విదేశీ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందామా.

జోష్​ హెజిల్​వుడ్​ (ఆస్ట్రేలియా)

Foreign cricketers who gave up crores of rupees in IPL for fear of corona virus
జోష్​ హేజిల్​వుడ్​ (ఆస్ట్రేలియా)

ఆస్ట్రేలియా క్రికెటర్​ జోష్​ హెజిల్​వుడ్​.. ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​ ప్రారంభానికి ముందే ఆడలేనని తేల్చి చెప్పేశాడు. బయోబబుల్​ కారణంగా కొన్ని నెలలుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నందున ఈసారి లీగ్​లో పాల్గొనట్లేదని స్పష్టం చేశాడు. హెజిల్​వుడ్​ను చెన్నై సూపర్​కింగ్స్ జట్టు రూ.2 కోట్ల ధరకు కొనుగోలు చేసింది.

జోష్​ ఫిలిప్​ (ఆస్ట్రేలియా)

మరో ఆస్ట్రేలియా ఆటగాడు జోష్​ ఫిలిప్​.. ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుత సీజన్​లో తాను ఆడలేనని చెప్పడం వల్ల సీజన్​ ప్రారంభానికి ముందు అతడి స్థానంలో ఫిన్​ అలెన్​ను రూ.20 లక్షలకు ఆర్సీబీ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది.

మార్క్​ వుడ్​ (ఇంగ్లాండ్​)

ఇటీవలే భారత పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్​లో రాణించిన ఇంగ్లాండ్​ బౌలర్​ మార్క్​ వుడ్​.. బయోబబుల్​లో ఉండలేనని ప్రస్తుత ఐపీఎల్​ సీజన్ నుంచి తప్పుకొన్నాడు. గతంలో సీఎస్కే జట్టు ఇతడిని రూ.1.5 కోట్లకు సొంతం చేసుకుంది.

మిచెల్​ మార్ష్​ (ఆస్ట్రేలియా)

యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ తరఫున ఆడిన తొలి మ్యాచ్​లోనే గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు ఆస్ట్రేలియా బౌలర్​ మిచెల్​ మార్ష్​. అయితే ఈ ఏడాది మరోసారి బయోబబుల్​లో అడేందుకు అతడు ఆసక్తి చూపలేదు.

లివింగ్​స్టోన్​ (ఇంగ్లాండ్​)

లివింగ్​స్టన్​ (ఇంగ్లాండ్​)

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో రాజస్థాన్ రాయల్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లాండ్​ క్రికెటర్​ లివింగ్​స్టోన్​.. ఈ ఏడాది జట్టులో చేరినా, బయోబబుల్​లో ఎక్కువ రోజులు గడపలేనని టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

ఇదీ చూడండి.. ఆగస్టులో కరేబియన్​ ప్రీమియర్​ లీగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.