ఓటమిపై ఉన్న భయం, బంతిపై మరింత ఏకాగ్రత ఉండేలా చేసిందని చెప్పాడు స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. దీని వల్ల టీ20 వల్ల వివిధ పరిస్థితుల గురించి తెలుసుకోగలిగానని అన్నాడు. గతేడాది ఐపీఎల్లో ఆడిన ఏబీ.. మళ్లీ ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
"మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్లు ఆడి, బ్యాటింగ్ బాగా నేను చేసేందుకు ప్రయత్నిస్తాను. ఇది వినడానికి చాలా సులువుగా అనిపించొచ్చు. కానీ మిడిలార్డర్లో బ్యాటింగ్ చాలా కష్టం. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అలానే ఔటైపోతాననే భయం కూడా బంతిపై ఏకాగ్రత పెంచేలా చేసింది" అని డివిలియర్స్ చెప్పాడు.
"సన్‌రైజర్స్‌తో తలపడటం నిజంగా గొప్ప సవాలు. ఆ జట్టుతో మ్యాచ్ అంటే నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. వారి తెలివైనవారు, ఆ ప్రతిభతో మిమ్మల్ని ఎప్పుడు ఛాలెంజ్ చేస్తారు. ఒకవేళ హైదరాబాద్ టీమ్ అవకాశమిస్తే వాళ్లకంటే ప్రమాదకారులు మరొకరు ఉండరు" అని డివిలియర్స్ అన్నాడు.