ETV Bharat / sports

IPL 2021: 'ఐపీఎల్​ జరిపే ఛాన్స్ మిస్ చేసుకుంది' - క్రికెట్ న్యూస్

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ బోర్డు, ఐపీఎల్ జరిపే సదావకాశాన్ని చేజార్చుకుందని ఆ దేశ ఆటగాడు బుచర్ అన్నాడు. త్వరలో ఇంగ్లాండ్ వెళ్లనున్న టీమ్​ఇండియా.. ఆ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్​ ఆడనుంది.

england cricket ipl
ఐపీఎల్
author img

By

Published : May 28, 2021, 8:44 AM IST

Updated : May 28, 2021, 11:42 AM IST

ఐపీఎల్​ విషయంలో టీమ్​ఇండియా అభ్యర్ధను ఇంగ్లాండ్ బోర్డు అంగీకరించి ఉండాల్సిందని ఆ దేశ మాజీ ఆటగాడు మార్క్ బుచర్ అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్టుల సిరీస్​ను వాయిదా వేసి, ఐపీఎల్​ మిగిలిన మ్యాచ్​లను ఇంగ్లీష్ గడ్డపై నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నాడు. తద్వారా భారత స్టార్ క్రికెటర్లు 'ద హండ్రెడ్' లీగ్​లో ఆడే అవకాశం ఉండేదని చెప్పాడు.

ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్​తో ఆ దేశంలో ఐదు టెస్టులు ఆడనుంది టీమ్​ఇండియా. అయితే వాటిని వాయిదా వేసి, ఐపీఎల్​ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ కోరింది. కానీ ఈసీబీ(ECB) నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ipl 2021
ఐపీఎల్

ఇదే విషయమై మాట్లాడిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ యాష్లే గైల్స్.. తమ ఆటగాళ్లను ఐపీఎల్ మిగిలిన మ్యాచ్​ల్లో ఆడేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సదరు లీగ్ కోసం తమ జాతీయ జట్టు షెడ్యూల్​ను మార్చుకునే ప్రసక్తే లేదని చెప్పారు.

ఏప్రిల్- మే లో మన దేశంలో జరిగిన ఐపీఎల్​.. ప్లేయర్లకు కరోనా సోకిన కారణంగా నిరవధిక వాయిదా పడింది. అయితే మిగిలిన మ్యాచ్​లను సెప్టెంబరు-అక్టోబరులో యూఏఈలో నిర్వహించాలని భారత బోర్డు భావిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : May 28, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.