ETV Bharat / sports

'ముంబయికి వద్దు.. ఈసారి కొత్త ఛాంపియన్​ను చూద్దాం' - వీరేంద్ర సెహ్వాగ్

ఈ ఐపీఎల్​ సీజన్​లో(IPL 2021 News) డిఫెండింగ్​ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​ జట్టు(MI team) ట్రోఫీ గెలవడం ఇష్టం లేదని చెప్పాడు భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్(virender sehwag latest news). కొత్త జట్టు కప్​ గెలిస్తే చూడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Virendra Sehwag
వీరేంద్ర సెహ్వాగ్
author img

By

Published : Oct 2, 2021, 12:33 PM IST

ప్లే ఆఫ్​ రేసు సమీపిస్తున్న కొద్దీ ఐపీఎల్​(IPL 2021 News) మరింత ఆసక్తికరంగా మారుతోంది. లీగ్​ దశలో జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virendra Sehwag latest comments) ఐపీఎల్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి కొత్త ఛాంపియన్​ను చూడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఈ సీజన్​లో చెన్నై సూపర్​ కింగ్స్ టేబుల్​ టాప్​లో నిలిచింది. 18 పాయింట్స్​తో ప్లే ఆఫ్స్​కు మొదటగా చోటు సంపాదించింది. తర్వాతి స్థానంలో దిల్లీ జట్టు ఉండగా మూడో స్థానంలో ఆర్సీబీ రాణిస్తోంది. అయితే.. డిఫెండింగ్ ఛాంపియన్స్​ ముంబయి ఇండియన్స్​ మాత్రం ఈసారి పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబయి జట్టును ఉద్దేశిస్తూ మాట్లాడాడు సెహ్వాగ్.

"ముంబయి ఇండియన్స్​ టాప్​-4కు రావాలని నేను ఆశించట్లేదు. కొత్త జట్టు క్వాలిఫై అవ్వాలి. కొత్త ఛాంపియన్​ను చూడాలి. బెంగళూరు, దిల్లీ, పంజాబ్ జట్లలో ఓ జట్టుకు ట్రోఫీ దక్కితే బాగుంటుంది."

-సెహ్వాగ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్.

మిగతా మ్యాచ్​లు కూడా గెలిస్తే ముంబయి ఇండియన్స్​ ప్లే ఆఫ్స్​కు సులభంగా వెళుతుందని చెప్పాడు సెహ్వాగ్. కానీ, అది అంత సులభం కాదని వ్యాఖ్యానించాడు. గెలవాలనే తపనలో కొన్ని తప్పిదాలు జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డాడు.

ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఈ సీజన్​లో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. కాగా నేడు షార్జా వేదికగా దిల్లీ క్యాపిటల్స్​తో తలపడనుంది ముంబయి.

ఇదీ చదవండి:

IPL 2021 News: 'భారత క్రికెటర్లను పక్కనబెట్టడం ఇబ్బందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.