ETV Bharat / sports

IPL 2021: ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం: రాహుల్ - Rohit sharma KL Rahul

ఐపీఎల్​లో(ipl 2021) పంజాబ్ కింగ్స్ ఒత్తిడి తట్టుకోలేకపోతుందని ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. మంబయితో మ్యాచ్​ ఓటమి అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. తర్వాతి మ్యాచ్​ల్లో రాణిస్తామని చెప్పాడు.

Rahul accepts his team can't handle "pressure"
కేఎల్ రాహుల్
author img

By

Published : Sep 29, 2021, 11:56 AM IST

ముంబయి ఇండియన్స్‌(ipl mumbai vs punjab) మళ్లీ గెలిచింది. మంగళవారం రాత్రి పంజాబ్‌తో తలపడిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీనిపై స్పందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(rohit sharma ipl) ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య పరిస్థితులను అర్థం చేసుకొని ఆడాడని మెచ్చుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడాడు.

'ఈ సీజన్‌లో మా శక్తిమేర రాణించలేదని ఒప్పుకొంటాం. ఇది అతిపెద్ద టోర్నీ. ప్రణాళికలకు కట్టుబడి ఉండాలి. మ్యాచ్‌ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఆత్వివిశ్వాసం పెరుగుతుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ ఆడిన తీరు, పరిస్థితులను అర్థం చేసుకున్న విధానం జట్టు కోణంలో ముఖ్యమైనవి. సౌరభ్‌ తివారీ కూడా బాగా ఆడాడు. ఇద్దరూ క్రీజులో నిలబడటం ఎంతో అవసరం. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ను పక్కనపెట్టడం కఠిన నిర్ణయమే అయినా సానుకూలంగా ఉన్నాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో రాణిస్తాడనే నమ్మకం అతడికి ఉంది. అతడు మాకు ముఖ్యమైన ఆటగాడు.. జట్టు యాజమాన్యం అండగా ఉంటుంది' అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

Rohit sharma KL Rahul
కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ

ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం: రాహుల్‌

ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(kl rahul ipl) మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో బాగా ఆడినా తాము చేసిన స్కోరు 135 తక్కువేనని చెప్పాడు. ఈ పిచ్‌పై 170 పరుగులు చేయాల్సి ఉందన్నాడు. బౌలింగ్‌లో తమ ఆటగాళ్లు ఆకట్టుకున్నా బ్యాటింగ్‌లో విఫలమయ్యారన్నాడు. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లు ఆసక్తికరంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అలాగే పాయింట్ల పట్టిక కూడా ఆసక్తికరంగా ఉందని, మిగిలిన మ్యాచ్‌ల్లో రాణించేందుకు కృషి చేస్తామన్నాడు. అలాగే తాము ఒత్తిడి తట్టుకోలేకపోతున్నట్లు రాహుల్‌ పేర్కొన్నాడు. ఓటములు ఎదురైనా సానుకూలంగా ఆలోచించాలని, మిగిలిన మ్యాచ్‌లపై దృష్టి సారిస్తామని చెప్పాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.