ప్రేక్షకులను అలరించేందుకు మరి కాసేపట్లో ఐపీఎల్ రెండో దశ(ipl second phase) ప్రారంభంకానుంది. దుబాయ్ వేదికగా రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ముంబయి ఇండియన్స్, ఎం.ఎస్.ధోనీ కెప్టెన్‌గా(csk vs mumbai ipl 2021) ఉన్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది సీఎస్కే. అయితే ఈ మ్యాచ్కు ముంబయి సారథి హిట్మ్యాన్ దూరమయ్యాడు. పొలార్డ్ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక ఈ జట్టు తరఫున అన్మోల్ప్రీత్ సింగ్ ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు.
రెండు బలమైన జట్లే కావడం వల్ల ఏ జట్టు విజేతగా నిలుస్తుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఇరు జట్లు 31 మ్యాచ్ల్లో తలపడగా.. అందులో సీఎస్కే 12 గెలవగా.. ముంబయి 19 మ్యాచ్ల్లో విజయం సాధించింది.
జట్లు:
ముంబయి ఇండియన్స్: క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అన్మోల్ప్రీత్ సింగ్, కిరన్ పొలార్డ్ (సి), సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్య, అడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
చెన్నై సూపర్ కింగ్స్: డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ధోనీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హెజెల్‌వుడ్
ఇదీ చూడండి: IPL 2021: తగ్గేదేలే.. అప్పటిలానే ఆడతాం: కోహ్లీ