ETV Bharat / sports

మ్యాచ్​పై ఆశల్లేవు.. డెత్​ ఓవర్లే కొంప ముంచాయి

గురువారం జరిగిన రాజస్థాన్​-దిల్లీ మ్యాచ్​ గురించి ఇరుజట్ల కెప్టెన్లు స్పందించారు. అసలు ఆశల్లేని మ్యాచ్​ను మోరిస్, మిల్లర్​లు గెలిపించారని రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ అభిప్రాయపడ్డాడు. డెత్​ ఓవర్లే తమ కొంప ముంచాయని దిల్లీ సారథి పంత్​ తెలిపాడు. ​

pant, unadkat, samson, morris
పంత్, ఉనద్కత్, శాంసన్, మోరిస్
author img

By

Published : Apr 16, 2021, 9:47 AM IST

కఠిన పరిస్థితుల్లో రాణించే అనుభవం వచ్చిందని రాజస్థాన్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ అంటున్నాడు. మొదట్లో గెలుపుపై ఆశల్లేవని.. మోరిస్‌, మిల్లర్‌ రాణించడం వల్ల నమ్మకం కలిగిందని ఆ జట్టు సారథి సంజు శాంసన్‌ అన్నాడు. దిల్లీ తమ కన్నా బాగా బౌలింగ్‌ చేసిందని క్రిస్‌ మోరిస్‌ అభిప్రాయపడ్డాడు. డెత్‌ ఓవర్లు కట్టుదిట్టంగా వేసుంటే గెలిచేవాళ్లమని దిల్లీ క్యాపిటల్స్‌ సారథి రిషభ్ పంత్‌ ధీమా వ్యక్తం చేశాడు. పంత్ సేన నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని సంజు బృందం మరో 2 బంతులుండగా 3 వికెట్ల తేడాతో ఛేదించిన సంగతి తెలిసిందే.

ఆ అనుభవం సొంతమైంది..

"కఠిన పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయగల అనుభవం వచ్చిందనే చెప్తాను. సొంత మైదానంలో ఆడుతున్న అనుభూతి కలిగింది. కొత్త బంతితో స్వేచ్ఛగా బౌలింగ్‌ చేశాను. గత సీజన్లో అంతగా రాణించలేదు. తొలి మ్యాచ్లో​ అవకాశం రాకపోవడం వల్ల దీనిని సమర్థంగా ఉపయోగించుకోవాలని భావించాను. గణాంకాలను పరిశీలిస్తే వేగం తగ్గించి బౌలింగ్‌ చేశానని తెలుస్తుంది. మంచి లెంగ్త్​ల్లో బంతులు వేయడమే కీలకం. కొద్దిగా తేమగా అనిపించడం వల్ల దానిని ఉపయోగించుకున్నా. పెళ్లయ్యాక ఎవ్వరైనా మారతారు! స్థిరత్వం, ప్రశాంతత వచ్చినట్టు అనిపిస్తోంది" అని జయదేవ్‌ ఉనద్కత్‌(4-0-15-3) పేర్కొన్నాడు.

మనసులో ప్రార్థించా..

"మిల్లర్‌, మోరిస్‌ ఆడటం వల్ల నమ్మకం కలిగింది. మొదట్లో కఠినంగా అనిపించింది. కానీ కుర్రాళ్లు గీత దాటించేశారు. పరిస్థితులను అధ్యయనం చేయడం ఎంతో కీలకం. మంచి లెంగ్త్​ల్లో, వైవిధ్యంతో కట్టుదిట్టంగా బంతులు వేయడం అవసరం. ముగ్గురు ఎడమచేతి వాటం బౌలర్లు ఉండటం మా బలం. వీరిని మేం భిన్నంగా ఉపయోగించుకుంటున్నాం. సకారియాతో మాట్లాడాం. అతడెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మనసులో దేవుడిని ప్రార్థించాను. నేనెప్పుడూ మ్యాచ్‌ అయ్యాక సమీక్షించుకుంటాను. నా తొలి మ్యాచ్‌ను వందసార్లు ఆడినా సింగిల్‌కు కచ్చితంగా నిరాకరిస్తాను" అని సంజు శాంసన్‌ తెలిపాడు.

ఇదీ చదవండి: అక్షర్​ స్థానంలో దిల్లీ క్యాపిటల్స్​లోకి ములాని

వాళ్ల బౌలింగ్‌ బాగుంది..

"నేనైతే దిల్లీ బౌలింగ్‌ చాలా బాగుందనే చెప్తాను. డేవిడ్‌ మిల్లర్‌ అద్భుతంగా ఆడాడు. టీ20 క్రికెట్లో ఆఖరికి ఏమైనా జరగొచ్చు. సంజు చక్కగా బాదేస్తున్నాడు. దీంతో మొదటి మ్యాచ్​లో సింగిల్‌కు నిరాకరించినా పెద్దగా బాధపడలేదు. అయితే అతడు బంతిని బౌండరీ సరిహద్దును దాటించి వుంటే సంతృప్తి కలిగేది. వాంఖడేలో తేమ ప్రభావం ఉండటం వల్ల బంతి జారుతోంది. అయినా వాళ్లు మా కన్నా బాగా బౌలింగ్‌ చేసి వికెట్లు పడగొట్టారు. మా బౌలర్లు వేగం తగ్గించి బంతులు వేయడంలో అనుభవజ్ఞులు. ఏదేమైనా మేం గెలిచినందుకు సంతోషంగా ఉంది. నేను గోల్ఫ్‌ విపరీతంగా ఆడతాను. అందుకే నా బ్యాటు స్వింగ్‌ బాగుంటుంది. (తొలి మ్యాచులో) 222 లక్ష్యాన్ని ఛేదించడం సులభమేమీ కాదు. కానీ మేం ఆ లక్ష్యాన్ని దాదాపుగా సమీపించాం. దీంతో కుర్రాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది" అని క్రిస్‌ మోరిస్‌(36*; 18 బంతుల్లో 4×6) పేర్కొన్నాడు.

ఆఖర్లో వేసుకుంటే..

"బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. చివర్లో మరికాస్త మెరుగ్గా బంతులు వేయాల్సింది. ఆటలో గెలుపోటములు సహజం. ఆఖర్లో తేమ ప్రభావం ఎక్కువగా ఉంది. ఏదేమైనా మేం మరో 15-20 పరుగులు చేయాల్సింది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసరడం మాకు సానుకూల అంశం. చివరి వరకు ఇలాగే వేసుంటే గీత దాటేవాళ్లం. రెండో ఇన్నింగ్స్‌లో తేమ మరీ ఎక్కువగా ఉంది. అందుకే నెమ్మది బంతులు ఆగలేదు. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో మేం మరేదైనా చేసుండాల్సింది" అని రిషభ్‌ పంత్(51; 32 బంతుల్లో 9×4)‌ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: వన్డేల్లో అగ్రస్థానానికి కోహ్లీనే కారణం: బాబర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.