ETV Bharat / sports

మహిళా క్రికెటర్​తో రుతురాజ్ వివాహం​.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? - పెళ్లి పీటలు ఎక్కబోతున్న గైక్వాడ్​

Ruturaj Gaikwad Wedding : మహారాష్ట్ర క్రికెటర్​, సీఎస్​కే ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్​లో రాణిస్తున్న ఓ మహిళా క్రికెటర్​ను అతడు వివాహం చేసుకోబోతున్నాడు. ఇంతకీ ఆమె ఎవరంటే..

cricketer ruthuraj gaikwad wedding date with women cricketer utkarsha pawar
క్రికెటర్​ను పెళ్లి చేసుకోబోతున్న మరో యువ​ ఆటగాడు​.. వారెవరంటే..
author img

By

Published : Jun 1, 2023, 11:40 AM IST

Updated : Jun 1, 2023, 12:00 PM IST

Ruturaj Gaikwad Marriage : ఐపీఎల్​ జట్టు చెన్నై సూపర్​ కింగ్స్​ స్టార్​ ప్లేయర్​ రుతురాజ్​ గైక్వాడ్​ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. దేశవాళీ క్రికెట్​లో దూసుకుపోతున్న మహిళా ఉత్కర్ష పవార్​ క్రికెటర్​ను వివాహమాడనున్నాడు. ఈ నెల 2,3 తేదీల్లో వీరిద్దరి వివాహం జరగనుంది. పూణెకు చెందిన ఉత్కర్ష పవార్..​ ప్రస్తుతం మహారాష్ట్ర తరుఫున దేశవాళీ క్రికెట్​లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది.
Ruturaj Gaikwad Wife : ఉత్కర్ష పవార్ 1998 అక్టోబర్ 13న మహారాష్ట్ర పుణెలో జన్మించింది. ఈమె తన 11 ఏళ్ల వయసు నుంచే క్రికెట్​ ఆడటం మొదలుపెట్టింది. ప్రస్తుతం పూణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్స్‌లో చదువుతోంది.

Ruturaj Gaikwad WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా క్రికెట్​ కమిటీ అవకాశం ఇచ్చింది. కానీ, పెళ్లి కారణంగా ఈ మెగా ఫైనల్​కు ఎంపిక చేసిన జట్టు నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. తన వివాహం ఉండటం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉండనని గైక్వాడ్​ ఇప్పటికే బీసీసీఐకి సమాచారమిచ్చాడు. దీంతో ఇతడి స్థానంలో మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసింది బోర్డు. ఈ సందర్భంగా విరాట్​ కోహ్లితో కలిసి లండన్​ వెళ్లిన అతడు ప్రాక్టీస్​తో​ బిజీగా ఉన్నాడు.

ఇటీవల ఐపీఎల్​ ఫైనల్​లో సీఎస్​కే విజయం సాధించిన అనంతరం రుతురాజ్ గైక్వాడ్​, ఉత్కర్ష పవార్​ కెప్టెన్ ధోనీతో కలిసి ఓ ఫొటో దిగారు. అలాగే ఐపీఎల్​ ట్రోఫీ పట్టుకొని విరిద్దరు కలిసి దిగిన ఫొటోను సైతం గైక్వాడ్​ తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో షేర్​ చేశాడు. ధోనీతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్​ చేస్తూ.. 'నా జీవితంలో ఇద్దరు వీవీఐపీలు' అనే క్యాప్షన్​ను కూడా జోడించాడు. వీరి ఫొటోలను చూసిన కొందరు నెటిజన్లు పెళ్లి చేసుకోబోయే ఇద్దరికీ కంగ్రాట్స్​ చెబుతున్నారు.

Ruturaj IPL Stats : 2021లో జరిగిన ఐపీఎల్​ సీజన్​ లీగ్​లో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్​గా రుతురాజ్​ నిలిచాడు. ఐపీఎల్​ 2021లో ఆరెంజ్​ క్యాప్​ గెలిచిన గైక్వాడ్.. ఈ ఏడాది సీజన్​లో 590 పరుగులు చేసి జట్టు విజయాల్లో ముఖ్య పాత్ర వహించాడు. గైక్వాడ్, మరో ఓపెనర్​ డెవాన్ కాన్వేతో కలిసి పలు మ్యాచుల్లో మంచి పార్ట్​నర్​ షిప్​ను నెలకొల్పారు. ఫైనల్​ మ్యాచ్​లోనూ వీరిద్దరూ కలిసి అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటారు.

Last Updated : Jun 1, 2023, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.