ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లను యూఏఈ(UAE)లో జరపనున్నట్లు బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఆడరని తేలిపోయింది. ఇప్పుడు తమ దేశ ఆటగాళ్లు మిగిలిన సీజన్లో ఆడేది లేనిది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) సోమవారం వెల్లడించింది.
ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత గత కొన్నిరోజుల నుంచి క్వారంటైన్లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. తమ కుటుంబాలతో సోమవారమే కలిశారు. త్వరలో జట్టుగా కలవనున్న ఆటగాళ్లు.. జులైలో వెస్టిండీస్ పర్యటనకు, ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్తారు.
అయితే ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు జరపాలనుకుంటున్న సెప్టెంబరు-అక్టోబరులో ఆసీస్‌కు ఎలాంటి సిరీస్‌లు లేవు. కాబట్టి ఆ దేశ ఆటగాళ్లు.. సీజన్లో ఆడే విషయమై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి?
ఇది చదవండి: IPL 2021: ప్రేక్షకులకు అనుమతి.. కానీ!