ETV Bharat / sports

ఐపీఎల్ వాయిదా.. బీసీసీఐ నష్టం రూ.2000 కోట్లు! - BCCI loss

కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్​ను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా ద్వారా బీసీసీఐకి దాదాపు రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లనుంది.

BCCI
బీసీసీఐ
author img

By

Published : May 4, 2021, 7:59 PM IST

కరోనా కారణంగా ఐపీఎల్​ను వాయిదా వేశారు నిర్వాహకులు. బయోబబుల్​లోని ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే లీగ్​ను వాయిదా వేయడం వల్ల బీసీసీఐకి దాదాపు 2 వేల నుంచి 2,500 కోట్ల నష్ట వాటిల్లబోతుంది. తాజాగా ఈ విషయంపై స్పందించారు బోర్డుకు చెందిన ఓ అధికారి.

"అర్ధాంతరంగా ఐపీఎల్​ను వాయిదా వేయడం వల్ల మేము రూ.2000 నుంచి రూ. 2,500 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది. అది 2,200 కోట్ల వరకు ఉంటుందని అంచనా." అని బోర్డు అధికారి తెలిపారు.

మొత్తంగా ఐపీఎల్​ ఈ సీజన్​లో మే 30 వరకు 52 రోజుల పాటు 60 మ్యాచ్​లు జరగాలి. కానీ 24 రోజుల్లోనే కరోనాతో ఈ సీజన్​ను వాయిదా వేశారు. ఇప్పటివరకు కేవలం 29 మ్యాచ్​లు మాత్రమే పూర్తయ్యాయి.

నష్టాలు ఇలా ఉన్నాయి..

  • ఈ టోర్నీ వాయిదా వల్ల బీసీసీఐ ఎక్కువగా నష్టపోయేది బ్రాడ్​కాస్టర్ స్టార్ స్పోర్ట్స్​ నుంచి వచ్చే ఆదాయమే. ఏడాదికి రూ.3269.4 కోట్ల చొప్పున ఐదేళ్లకు గానూ రూ.16,347 కోట్లకు స్టార్ స్పోర్ట్స్​తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది బీసీసీఐ. ప్రతి సీజన్​కు 60 మ్యాచ్​లు ఉంటాయని అనుకుంటే.. ప్రతి మ్యాచ్​కు దాదాపు 54.5 కోట్ల విలువ ఉంటుంది. దీని ప్రకారం 29 మ్యాచ్​లకు స్టార్ స్పోర్ట్స్​ దాదాపు రూ.1580 కోట్లు చెల్లించాలి. ఒకవేళ టోర్నీ మొత్తం జరిగితే ఇది రూ.3270 కోట్లుగా ఉండేది. దీంతో బోర్డు దాదాపు రూ.1690 కోట్లు నష్టపోవాల్సి వస్తోంది.
  • అలాగే ఐపీఎల్​కు టైటిల్ స్పాన్సర్​గా వ్యవహరిస్తోన్న వివో ప్రతి సీజన్​కు రూ.440 కోట్లకు డీల్ కుదుర్చుకుంది. ఈ సీజన్​ వాయిదాతో దాదాపు సగానికిపైగా నష్టాలు భరించాల్సి వస్తోంది.
  • అలాగే అసోసియేట్ స్పాన్సర్స్ అన్​అకాడమీ, డ్రీమ్ 11, క్రెడ్, అప్​స్టాక్స్, టాటా మోటార్స్​లతో ఒక్కొక్కరి ద్వారా బీసీసీఐకి రూ.120 కోట్లు రావాల్సి ఉంది. మరికొందరు సబ్సిడరీ స్పాన్సర్స్ కూడా ఉన్నారు. ఈ ఆదాయం కూడా కోల్పోవాల్సి ఉంటుంది.

వాయిదానే ఉత్తమం

ఐపీఎల్​ వాయిదా వల్ల బీసీసీఐకి నష్టాలు వస్తుంటే.. ప్రసారదారు, స్పాన్నర్స్ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారు ఏవరేమన్నారో చూద్దాం.

  • ఐపీఎల్ వాయిదా వేయాలన్న బీసీసీఐ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాం. భారత్​లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై దృష్టిసారించడం ఉత్తమం. బిజినెస్ కంటే ఆటగాళ్ల రక్షణే ముఖ్యం -హర్ష్ జైన్, డ్రీమ్ 11 సీఈఓ, కో ఫౌండర్
  • ఎవరైతే కరోనా బారినపడ్డారో వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇంకేమీ చెప్పలేం. -టాటా మోటర్స్ ప్రతినిధి
  • ఐపీఎల్ వాయిదా నిర్ణయాన్ని స్టార్ ఇండియా సమర్థిస్తోంది. లీగ్​లో పాల్గొన్న ఆటగాళ్లు, సిబ్బంది ప్రతి ఒక్కరి రక్షణ మాకు చాలా ముఖ్యం. - స్టార్ ఇండియా ప్రకటన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.