ETV Bharat / sports

యూఏఈలో ఐపీఎల్​ మిగతా మ్యాచ్​లు! - ipl winner RCB

కరోనా వల్ల ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 14వ సీజన్​లోని మ్యాచ్​ల్ని సెప్టెంబరు-అక్టోబరులో జరపాలని బీసీసీఐ భావిస్తోంది. త్వరలో ఈ విషయంతో పాటు వేదిక గురించి స్పష్టత వచ్చే అవకాశముంది.

IPL 2021 in UAE
కోహ్లీ
author img

By

Published : May 23, 2021, 8:52 AM IST

Updated : May 23, 2021, 1:27 PM IST

ఐపీఎల్ ఆగిపోయిన మ్యాచ్​ల్ని ఎప్పుడు నిర్వహిస్తారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మే 29న జరిగే స్పెషల్ జనరల్ మీటింగ్​ తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే ఆ మ్యాచ్​లన్నింటినీ యూఏఈ వేదికగా జరపాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకోసం సెప్టెంబరు-అక్టోబరు విండోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

IPL 2021
ఐపీఎల్ ట్రోఫీ

త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్న టీమ్​ఇండియా.. జూన్ 18న న్యూజిలాండ్​తో ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఐదు టెస్టుల సిరీస్​లో ఇంగ్లాండ్​తో తలపడతుంది. ఇది పూర్తయిన వెంటనే అంటే సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మధ్యలో ఐపీఎల్​ మిగతా మ్యాచ్​ల్ని నిర్వహించాలనే ఆలోచనతో భారత క్రికెట్ బోర్డు ఉంది. ఆ నెల రోజుల్లో 31 మ్యాచ్​ల్ని జరపాలని భావిస్తోంది. అక్టోబరు ద్వితియార్ధంలో జరిగే టీ20 ప్రపంచకప్​ ఉండటమే ఈ విండో ఎంపికకు కారణంగా తెలుస్తోంది.

ఇది చదవండి: ఐపీఎల్​ కోసం బీసీసీఐ విశ్వప్రయత్నాలు.. ఎందుకు?

Last Updated : May 23, 2021, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.