ఐపీఎల్(ipl 2021 news) రెండో విడత మ్యాచ్‌లు అభిమానులకు మంచి జోష్‌ను అందిస్తున్నాయి. మొదటి రోజు చెన్నై-ముంబయి(csk vs mi 2021), రెండో రోజు కోల్‌కతా-బెంగళూరు(kkr vs rcb 2021) మధ్య జరిగిన మ్యాచ్‌లు మంచి వినోదాన్ని పంచాయి. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 21) రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్(rr vs pk live) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఈ సీజన్‌ను విజయాలతో ప్రారంభించి డీలాపడిన పంజాబ్ ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. అలాగే రాజస్థాన్ కూడా విజయం కోసం శ్రమిస్తోంది.
పంజాబ్‌కు అదే సమస్య!
పంజాబ్ కింగ్స్‌కు ప్రధాన సమస్య మిడిలార్డర్. 2018-21 వరకు చూసుకుంటే ఈ జట్టు మొత్తం పరుగుల్లో టాపార్డర్వే 50శాతానికి పైగా ఉంటాయి. జే రిచర్డ్సన్, మెరిడిత్, డేవిడ్ మలన్ తప్పుకోవడం వల్ల జట్టులోకి వచ్చిన నాథన్ ఎల్లిస్, అదిల్ రషీద్, మర్క్రమ్పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా మర్క్రమ్ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో విఫలమైన గేల్‌కు జట్టులో చోటు దక్కకపోవచ్చు. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ స్పిన్ బౌలింగ్‌లో విఫలమవతుండటం వల్ల పంజాబ్.. అదిల్ రషీద్‌ను ఆడించే వీలుంది.
రాజస్థాన్ నిలుస్తుందా?
జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై, ఆర్చర్ వంటి ఆటగాళ్లు వైదొలగడం రాజస్థాన్‌కు పెద్ద దెబ్బ. వీరి స్థానంలో ఎవిన్ లూయిస్, ఒషానే థామస్, షంసీ, గ్లెన్ ఫిలిప్స్‌లను జట్టులోకి తీసుకుంది. ఈ కొత్త వారిలో ఎవిన్ లూయిస్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇతడు ఇటీవల ముగిసిన సీపీఎల్‌లో 426 రన్స్‌తో ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఈ జట్టు మరో ఆటగాడు లివింగ్‌స్టోన్ పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. షంసీ కూడా జట్టుకు మంచి ఆల్‌రౌండ్ ఆప్షన్. అయితే ఇతడికి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌తో పోటీ ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టోర్నీలో ముస్తాఫిజుర్ మంచి ప్రదర్శన కనబర్చాడు.
జట్లు (అంచనా)
పంజాబ్ కింగ్స్
కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్/మర్క్రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుక్ ఖాన్, అదిల్ రషీద్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, షమీ
రాజస్థాన్ రాయల్స్
ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, శివం దూబే, లివింగ్‌స్టోన్, రాహల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రెహ్మన్/షంసీ