ETV Bharat / sports

IPL 2021:ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశాలు..

ఐపీఎల్​(IPL 2021) కోసం ఇంగ్లాండ్​ నుంచి దుబాయ్​కు వెళ్లేవారంతా.. ఆరు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఫ్రాంచైజీలకు సూచించింది బీసీసీఐ(BCCI news). ఈ మేరకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

MI vs CSK
ముంబయి, సీఎస్కే
author img

By

Published : Sep 11, 2021, 2:14 PM IST

యూఏఈ వేదికగా ఐపీఎల్(IPL 2021 news) త్వరలోనే​ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలకు పలు సూచనలు ఇచ్చింది బీసీసీఐ. బ్రిటన్ నుంచి యూఏఈకి వెళ్లే వారంతా.. బయోబబుల్​లో చేరడానికి ముందు ఆరు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలని పేర్కొంది.

"ఇంగ్లాండ్ నుంచి అబుదాబికి వెళ్లేవారంతా.. టీమ్​ బయోబబుల్​లో చేరడానికి ముందే ఆరు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలి. ఈ విషయం బీసీసీఐ అన్ని ఫ్రాంజైజీలకు స్పష్టంగా తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. ఆటగాళ్లను ఓ బబుల్ నుంచి మరో బబుల్​కు పంపాలని నిర్ణయించుకుంది." అని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి తెలిపారు.

ప్రస్తుతం ఇంగ్లాండ్, టీమ్​ఇండియా(Ind vs Eng 5th test) మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దయిన నేపథ్యంలో వివిధ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను దుబాయ్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ సిరాజ్​ కోసం ఆదివారం ప్రత్యేకంగా చార్టర్​ ఫ్లైట్​ ఏర్పాటు చేసినట్లు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు టీమ్​ సభ్యులు తెలిపారు. చెన్నై జట్టు కూడా తమ ఆటగాళ్లను దుబాయ్​ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ జట్టు సీఈఓ విశ్వనాథన్ పేర్కొన్నారు.

కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్(IPL updates)​.. సెప్టెంబర్​ 19న తిరిగి ప్రారంభం కానుంది. సీఎస్కే, ముంబయి(MI vs CSK) జట్ల మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది. మొత్తంగా జరగాల్సిన మ్యాచ్​లలో 13 దుబాయ్​లో, 10 సార్జాలో, 8 అబుదాబిలో జరగనున్నాయి.

ఇదీ చదవండి:

IPL 2021: ఐపీఎల్​లో ఎయిర్​ అంబులెన్స్​- 30 వేల RT-PCR​ కిట్లు

IPL 2021: ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలు.. సీఎస్​కే తప్ప!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.