ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం (అక్టోబర్ 10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల(SRH vs RCB head to head) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ జట్టుపై తన అభిప్రాయాన్ని తెలిపాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra News Latest). ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఏకపక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
"ఓ జట్టు టాప్-2లో స్థానం కోసం ప్రయత్నిస్తుండగా మరో జట్టు ఇక ఆడలేం ఇంటికి వెళ్లాలి అన్నట్లు ఎదురుచూస్తోంది. హైదరాబాద్ జట్టుకు వీసాలు, బోర్డింగ్ పాసులు సిద్ధంగా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు శారీరకంగానే టోర్నీలో ఉన్నారు. మానసికంగా ఇంటికి వెళ్లి చాలా సమయం అవుతోంది."
-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.
జేసన్ రాయ్, విలియమ్సన్ బ్యాటింగ్‌లో విఫలమైతే సన్‌రైజర్స్ తక్కువ లక్ష్యానికే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా(Aakash Chopra news) అన్నాడు. అయితే హైదరాబాద్ జట్టుపై ఎలాంటి నమ్మకం లేదని.. అనుభవం లేని ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నాడు.
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ జట్టు కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మరోవైపు బెంగళూరు మూడో స్థానంలో ఉంది.