చెన్నైలో ఐపీఎల్ 2021(ipl 2021 news) టైటిల్ విజయోత్సవాలు జరిగాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బీసీసీఐ కార్యదర్శి జై షా, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2022 నిర్వహణ వేదికపై స్పష్టతనిచ్చారు జై షా(bcci secretary jay shah).
"అన్ని అనుకూలంగా ఉంటే వచ్చే ఏడాది ఐపీఎల్ (15వ సీజన్)ను భారత్‌లోనే నిర్వహిస్తాం. మరో రెండు జట్లు వస్తున్న నేపథ్యంలో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నా. చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే ఆడటం మీరు చూసే అవకాశం ఉంది. త్వరలోనే మెగా వేలం(ipl 2022 mega auction date) నిర్వహించబోతున్నాం. కొత్త వచ్చే కాంబినేషన్స్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది."
-జై షా, బీసీసీఐ కార్యదర్శి
ఐపీఎల్-2021 సీజన్(ipl 2021 news)ను భారత్‌లోనే నిర్వహించాలని తలపెట్టారు. కానీ కొద్ది రోజులకే బయో బబుల్‌లో కరోనా తీవ్రత వల్ల కొన్ని మ్యాచ్‌ల తర్వాత లీగ్‌ను అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఈ సీజన్ రెండో దశను యూఏఈ వేదికగా నిర్వహించగా చెన్నై సూపర్ కింగ్స్(ipl 2021 winner) విజేతగా నిలిచింది.