ETV Bharat / sports

IPL 2022 Mega auction: ఎవరీ జలాలాబాద్‌ నరైన్‌? - ఐపీఎల్​ మెగావేలం రమేశ్​ కుమార్​

IPL Mega auction 2022 Ramesh kumar: ఐపీఎల్​ మెగావేలంలో పలువురు ఆటగాళ్లు కోట్ల ధరకు అమ్ముడుపోగా మరికొంతమందిని తక్కువ ధరకే కొనుగోలు చేశాయి ఆయా ఫ్రాంఛైజీలు. అయితే ఈ ప్లేయర్స్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ సొంతం చేసుకున్న ఆల్​రౌండర్​ రమేశ్​కుమార్​ నేపథ్యం స్ఫూర్తిదాయకం. ఓ సారి అతడి గురించి తెలుసుకుందాం..

Kolkata Knight riders Ramesh kumar career
కోల్​కతా నైట్​ రైడర్స్ జలాలాబాద్‌ నరైన్‌
author img

By

Published : Feb 16, 2022, 6:24 AM IST

Updated : Feb 16, 2022, 7:05 AM IST

IPL Mega auction 2022 Ramesh kumar: కోట్లు కోట్లు కుమ్మరించిన ఐపీఎల్‌ వేలంలో ఒక ఆటగాడికి రూ.20 లక్షలు పలకడం పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు! కానీ ఆ మొత్తమే అతడికి పెద్ద నిధి! కెరీర్‌కు పునాది వేసే గొప్ప బహుమానం! ఎంతోమంది స్టార్‌ ఆటగాళ్లను కూడా నిరాశపరిచిన ఈసారి మెగా వేలం.. టెన్నిస్‌ బంతితో ఆడడమే తెలిసిన ఓ కుర్రాడిని తట్టి లేపింది. అనామకుడిగా ఉన్న అతడిని క్రికెట్‌ ప్రపంచానికి తెలిసేలా చేసింది. అతడే రమేశ్‌ కుమార్‌. వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కనీస ధర రూ.20 లక్షలకు సొంతమైన ఈ ఆల్‌రౌండర్‌ నేపథ్యం స్ఫూర్తిదాయకం.

పంజాబ్‌లోని జలాలాబాద్‌కు చెందిన 23 ఏళ్ల రమేశ్‌కుమార్‌ పేద కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి చెప్పులు కుడితే.. తల్లి గాజులు అమ్మేది. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకున్న రమేశ్‌.. టెన్నిస్‌ బంతి టోర్నమెంట్లలో ఆడేవాడు. బాగా ఆడితే వచ్చే రూ.500, రూ.1000 కోసం ఊరూరా తిరిగేవాడు. ఎడమచేతి వాటం బ్యాటింగ్‌, నరైన్‌ మాదిరే స్పిన్‌ బౌలింగ్‌తో అదరగొట్టే రమేశ్‌కు ‘జలాలాబాద్‌ నరైన్‌’ అనే పేరుంది. చాలా మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్లను గెలిపించేవాడు. ఓ స్థానిక టోర్నీలో 10 బంతుల్లోనే 50 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడతను. ఏడేళ్ల పాటు రబ్బరు బంతి, టెన్నిస్‌ బంతితోనే అతడు మ్యాచ్‌లు ఆడాడు. పంజాబ్‌ క్రికెట్‌ సంఘానికి చెందిన జిల్లా మ్యాచ్‌ల్లో సత్తా చాటడం ద్వారా రంజీ ట్రోఫీ శిబిరానికి రమేశ్‌కు పిలుపొచ్చింది. అప్పుడే టెన్నిస్‌ బంతితో కాకుండా తోలు బంతితో తొలిసారి ఆడాడు. ఆరంభంలో బంతిని స్పిన్‌ చేయడం కష్టమైనా నెమ్మదిగా పట్టు సంపాదించాడు.

అతడి సాయంతో..

పంజాబ్‌ ఆటగాడు గుర్‌కీరత్‌ మాన్‌ దృష్టిలో పడిన రమేశ్‌.. ముంబయిలో జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. అతడిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించిన కేకేఆర్‌ సహాయక కోచ్‌ అభిషేక్‌ నాయర్‌.. రమేశ్‌ పేరును ఐపీఎల్‌ వేలం జాబితాలో చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. కానీ కేకేఆర్‌ తనను వేలంలో కొంటుందని అతడు ఊహించలేకపోయాడు. "జీవితం ఇంకా మారలేదు. ఒక పునాది మాత్రమే పడింది. ఐపీఎల్‌లో ప్రదర్శన చేయడం కీలకం. నాన్నను చెప్పులు కుట్టొద్దని.. అమ్మని గాజులు అమ్మొద్దని కోరాను. ఐపీఎల్‌ ద్వారా వచ్చిన డబ్బుతో తమ్ముళ్లను చదివిస్తాను. పంజాబ్‌లో అన్ని ప్రాంతాలకు తిరిగి టెన్నిస్‌ బంతితో టోర్నీలు ఆడాను. రూ.500 వచ్చినా చాలా సంతోషించేవాడిని. కుటుంబానికి ఎంతో కొంత సాయం చేస్తున్నానని అనుకునేవాడిని. టెన్నిస్‌ బంతి తేలిక కావడం వల్ల స్పిన్‌ బాగా చేసేవాడిని.. ఇప్పుడిప్పుడే తోలు బంతికి అలవాటుపడుతున్నా" అని రమేశ్‌ చెప్పాడు. తనలాగే పేద కుటుంబం నుంచి వచ్చి భారత్‌కు ఆడిన పేసర్‌ నటరాజన్‌ను అతడు ఆదర్శంగా తీసుకున్నాడు. అయితే ఇప్పటిదాకా టెన్నిస్‌ బంతితోనే ఎక్కువగా ఆడిన రమేశ్‌.. ఐపీఎల్‌లో కోల్‌కతా తుది జట్టులో చోటు దక్కితే ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరం.

ఇదీ చూడండి: IND VS WI: ఆటగాళ్లకు రోహిత్​ శర్మ హెచ్చరిక!

Last Updated : Feb 16, 2022, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.