ఐపీఎల్-2023 మినీ వేలం పూర్తయింది. పలువురు ఆటగాళ్ల కోసం ప్రాంఛైజీలు భారీగా వెచ్చించాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లాండ్ ప్లేయర్ శామ్ కరన్ రికార్డు సృష్టించాడు. అతడిని రూ.18.50 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. కామెరూన్ గ్రీన్‌ను రూ.17.5 కోట్లకు ముంబయి, బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్లకు చెన్నై, నికోలస్ పూరన్‌ను రూ.16కోట్లకు లఖ్‌నవూ, హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు, మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది.
IPL Mini auction: ముగిసిన మినీ వేలం.. శామ్ కరన్‌దే రికార్డ్ ధర - IPL mini auction foreign players
21:02 December 23
19:53 December 23
రేహాన్‌కు చుక్కెదురు..
రేహాన్‌కు చుక్కెదురు..
తెలుగు యువకుడు నితీశ్ కుమార్ రెడ్డిన హైదరాబాద్ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. అలాగే అత్యంత తక్కువ వయస్సు ఆటగాడు రెహాన్ అహ్మద్‌ను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. రూ. 50 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన రెహాన్‌ను సంచలనంగా మారతాడని అంతా భావించారు. అయితే అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం గమనార్హం. టామ్ కరన్, వరుణ్ ఆరోన్ పరిస్థితి కూడా ఇదే.
19:37 December 23
ఐర్లాండ్ ప్లేయర్‌కు జాక్‌పాట్
ఐర్లాండ్ ప్లేయర్‌కు జాక్‌పాట్.. ఐర్లాండ్ యువ ప్లేయర్ జాషువా లిటిల్‌కు మంచి ధర దక్కింది. గుజరాత్ అతడిని రూ.4.40కోట్లకు దక్కించుకుంది. లఖ్‌నవూతో పోటీ పడి మరీ సొంతం చేసుకుంది.
సెహ్వాగ్ బంధువుకు మంచి ధర.. వీరేంద్ర సెహ్వాగ్‌కు బంధువైన మయాంక్ దగర్ను హైదరాబాద్ రూ.1.80కోట్లకు దక్కించుకుంది. ఇకపోతే సీనియర్లైన పీయూషన్ను రూ.50లక్షలకు ముంబయి, అమిత్ మిశ్రాను రూ.50లక్షలకు లఖ్‌నవూ సొంతం చేసుకుంది.
18:55 December 23
మిగిలిన సొమ్ము ఎంతంటే?
ఇప్పటివరకు 37 మంది ఆటగాళ్లను దక్కించుకున్న ఆయా ఫ్రాంచైజీలు దాదాపు రూ.140 కోట్లను ఖర్చు పెట్టాయి. ఇక పది ఫ్రాంచైజీల వద్ద మిగిలిన సొమ్ము ఎంతంటే..
- చెన్నై: రూ. 1.90 కోట్లు
- దిల్లీ: రూ. 9.05 కోట్లు
- ముంబయి: రూ. 1.55 కోట్లు
- గుజరాత్: రూ. 9.55 కోట్లు
- రాజస్థాన్: 7.45 కోట్లు
- పంజాబ్: రూ. 11.32 కోట్లు
- కోల్‌కతా : రూ.5.55 కోట్లు
- బెంగళూరు: రూ. 3.45 కోట్లు
- లఖ్‌నవూ: రూ.5.15 కోట్లు
- హైదరాబాద్: రూ.9.75 కోట్లు
18:25 December 23
లంచ్ బ్రేక్.. ఇప్పటివరకు పదమూడు సెట్ల ఆటగాళ్ల వేలం ముగిసింది. లంచ్ బ్రేక్ ఇచ్చారు. క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ల విభాగంలో రిలీ మెరిడిత్, సందీప్ శర్మ, తస్కిన్ అహ్మద్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.
క్యాప్డ్ ఆల్‌రౌండర్ల విభాగంలో శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక, కివీస్ ఆటగాడు జేమ్మీ నీషమ్, వ్యాన్ పార్నెల్, మహ్మద్ నబీ, డారిల్ మిచెల్ అన్‌సోల్డ్‌గా మగిలిపోయారు. ఇకపోతే రొమారియె షెఫెర్డ్‌ను రూ.50 లక్షలకు, డానియల్ సామ్స్‌ను రూ.75 లక్షలకు లఖ్‌నవూ సొంతం చేసుకుంది.
మనీశ్ పాండేను దిల్లీ రూ.2.4 కోట్లకు సొంతం చేసుకుంది
17:19 December 23
తెలుగు కుర్రాడు సూపర్
తెలుగు కుర్రాడు అదరగొట్టాడుగా.. అన్క్యాప్డ్ మికెట్ కీపర్ల వేలంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌ను గుజరాత్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.20లక్షల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన అతడిని కొనుగోలు చేసేందుకు చెన్నై, గుజరాట్ పోటీపడగా.. చివరికి గుజరాత్ సొంతం చేసుకుంది. ఇక రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ఎన్ జగదీశన్‌ను కోల్‌కతా రూ.90 లక్షలకు దక్కించుకుంది. మరో ప్లేయర్ ఉపేంద్ర యూదవ్ను హైదరాబాద్ రూ.25 లక్షలకు కొనుగోలు చేసింది.
16:46 December 23
నాలుగో సెట్లో క్యాప్డ్ బౌలర్ల వేలం జరుగుతోంది.
- ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ జొర్డాన్, ఆడమ్ మిల్నే -అన్‌సోల్డ్
- రీస్ టోప్లే- రూ.1.9కోట్లు- బెంగళూరు
- భారత బౌలర్ జయదేవ్ ఉనద్కత్-రూ.50లక్షలు-లక్నో జెయింట్స్
- జయ్ రిచర్డ్సన్-రూ.1.5కోట్లు, ముంబయి ఇండియన్స్
క్యాప్డ్ స్పిన్నర్ల విభాగంలో..
- ఇంగ్లాండ్ టాప్ స్పిన్నర్ అదిల్ రషీద్-రూ.2కోట్లు- హైదరాబాద్
- విండీస్ బౌలర్ అకీల్ హోసీన్, ఆడమ్ జంపా, తబ్రిజ్ షంసి- అన్‌సోల్డ్
16:21 December 23
సన్‌రైజర్స్ చెంతకు హెన్రిచ్
ఆ ఇద్దరు అన్‌సోల్డ్.. సన్‌రైజర్స్ చెంతకు హెన్రిచ్.. హెన్రిచ్ క్లాసీన్ను రూ.5.25కోట్లు సన్‌రైజర్స్ దక్కించుకుంది. కనీస ధర రూ.2కోట్లు వేలంలోకి వచ్చిన క్లాసీన్ కోసం హైదరాబాద్- దిల్లీ పోటీపడ్డాయి. చివరికి సన్‌రైజర్స్ రూ.5.25కోట్లకు సొంతం చేసుకుంది. ఇకపోతే కుశాల్ మెండిస్, టామ్ బాంటన్ అన్‌సోల్డ్‌గా మిగలగా.. ఫిల్ సాల్ట్‌ను దిల్లీ రూ. 2కోట్లకు దక్కించుకుంది.
16:18 December 23
నికోలస్ రూ.16కోట్లు
నికోలస్ రూ.16కోట్లు మూడో సెట్ వేలం ప్రారంభమైంది. క్యాప్డ్ వికెట్ కీపరల్ విభాగంలో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ అన్‌సోల్డ్‌గా కాగా, కరేబియన్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌ను రూ.16 కోట్లకు లక్నో జెయింట్స్ సొంతం చేసుకుంది.
15:45 December 23
కెమరూన్ గ్రీన్, బెన్‌స్టోక్స్ సూపర్
కెమరూన్ గ్రీన్, బెన్‌స్టోక్స్ సూపర్
- జేసన్ హోల్డర్ రాజస్థాన్ రాయల్స్ రూ.5.75కోట్లు
- ముంబయి ఇండియన్స్.. కెమరూన్ గ్రీన్‌ను రూ.17.5కోట్లు
- బెన్‌స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 16.25కోట్లకు దక్కించుకుంది.
15:32 December 23
సామ్ కరణ్ జాక్‌పాట్.. రెండో సెట్ ప్రారంభమైంది. ఈ సెట్లో క్యాప్డ్ ఆల్ రౌండర్స్ బరిలోకి దిగారు. మొదటగా రూ.1.5కోట్ల బేస్ ప్రైస్‌తో దిగిన షాకిబ్ అల్ హసన్‌ను అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్ సామ్ కరణ్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఏకంగా రూ.18.50కోట్లను దక్కించుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో ఇదే అత్యధిక ధర.
15:09 December 23
మయాంక్ కూడా సోల్డ్.. అన్‌సోల్డ్‌గా జో రూట్
ముగిసిన తొలి సెట్.. పంజాబ్ మాజీ కెప్టెన్ మయాంక అగర్వాల్‌ను కూడా సన్‌రైజర్స్ దక్కించుకుంది. రాజస్థాన్, బెంగళూరుతో పోటీ పడీ మరి అతడిని సొంతం చేసుకుంది. ఆ తర్వాత అజింక్యాను రహానెను చెన్నై జట్టు రూ.50 లక్షలకు దక్కించుకోగా.. జో,రూట్, రోసోవ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. దీంతో తొలి సెట్ ముగిసింది. అంతకుముందు కేన్ విలిమయ్సన్శ్(రూ.2కోట్లు), హ్యారీ బ్రూక్(రూ.13.5కోట్లు) అమ్ముడుపోయారు.
14:57 December 23
హ్యారీ బ్రూక్ రికార్డు ధర
రికార్డు ధర.. ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ వేలంపాటలో రికార్డు సృష్టించాడు. కనీస ధర రూ.2కోట్లతో బరిలోకి దిగిన అతడిని 13.25 కోట్లుకు సన్‌రైజర్స్ దక్కించుకుంది. రాజస్థాన్, బెంగళూరుతో పోటీ పడీ మరి అతడిని సొంతం చేసుకుంది.
14:46 December 23
కేన్ విలియమ్సన్‌ను కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ మినీ వేలం ప్రారంభమైంది. ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. మొదటగా క్యాప్డ్ ఆటగాళ్ల జాబితాను హ్యూ ఎడ్మీడ్స్ ప్రారంభించాడు. అంతకుముందు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ దుమాల్ ప్రారంభోపన్యాసం చేశారు. ఇక రూ.2కోట్ల బేస్ ప్రైస్‌తో ఆక్షన్‌లోకి దిగిన కేన్ విలియమ్సన్‌ను అదే ధరకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
13:37 December 23
ఐపీఎల్ మినీ వేలం
మరి కాసేపట్లో ఐపీఎల్ వేలం ప్రారంభం కానుంది. కొచ్చి వేదికగా ఈ ఆక్షన్ జరగనుంది. మొత్తం 10 జట్లలో 87 మందిని కొనుగోలు చేయచ్చు. అందులో 30 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. ఈ మినీ వేలంలో మొత్తం 405 ఆటగాళ్లు వేలంలో ఉంటారు. అందులో 273 మంది భారతీయులు కాగా, 132 మంది విదేశీ ఆటగాళ్లు. వీరికి నలుగు అసోసియేటివ్ దేశాల ఆటగాళ్లు అదనం.
వేలంలో ఆసక్తికర ఆటగాళ్లు వీరే!
భారత్ : మయాంక్ అగర్వాల్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, సౌరభ్ కుమార్, కె.ఎస్.భరత్, మనీశ్ పాండే, అజింక్య రహానె, అభిమన్యు ఈశ్వరన్
విదేశీ ఆటగాళ్లు: జో రూట్, కేన్ విలియమ్సన్, శామ్ కరన్, కామెరూన్ గ్రీన్, షకిబ్ అల్ హసన్, జేసన్ హోల్డర్, సికిందర్ రజా, బెన్ స్టోక్స్, లిటన్ దాస్, నికోలస్ పూరన్, ఆడమ్ జంపా, డేవిడ్ మలన్, రసీ వాన్ డెర్ డస్సెన్, జిమ్మీ నీషమ్, మహ్మద్ నబీ, డారిల్ మిచెల్, డసున్ శనక, టామ్ లేథమ్