ETV Bharat / sports

ఐపీఎల్ ముందు గుజరాత్ టైటాన్స్​కు బిగ్​ షాక్​! - జోష్ లిటిల్ ఐపీఎల్ 2023కు దూరం

ఐపీఎల్ 2023 సీజన్​కు ముందు గుజరాత్​ టైటాన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది! కీలక ప్లేయర్​ ఈ సీజన్​లోని ప్రారంభ మ్యాచ్​లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు...

gujarat titans josh little
ఐపీఎల్ ముందు గుజరాత్ టైటాన్స్​కు బిగ్​ షాక్​!
author img

By

Published : Feb 25, 2023, 6:08 PM IST

ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐర్లాండ్ పేసర్ జోష్ లిటిల్ గాయం కారణంగా ఈ ఏడాది మెగాలీగ్​ సీజన్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గతేడాది డిసెంబర్‌లో కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్‌ మినీవేలంలో అతడిని రూ.4.4 కోట్ల భారీ ధరకు గుజరాత్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పాకిస్థాన్​ సూపర్​ లీగ్​(పీఎస్‌ఎల్‌) జరుగుతోంది. అయితే ఈ టోర్నీలో ముల్తాన్‌ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జోష్​ లిటిల్‌ మోకాలి గాయం బారిన పడ్డాడు. దీంతో అతడు పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ మిగతా సీజన్​కు దూరమయ్యాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జోష్ లిటిల్.. మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లోలోని కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇకపోతే గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2022లో లిటిల్‌ మంచి ప్రదర్శన చేసి క్రికెట్​ ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నాడు. అలానే దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు.

ఇదీ చూడండి: శ్రీలంక క్రికెట్​ బోర్డు జాక్​పాట్​.. ఏకంగా రూ.630 కోట్ల లాభం.. చరిత్రలో తొలిసారిగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.