ETV Bharat / sports

ఐపీఎల్​లో కొత్త ఫార్మాట్.. చెన్నై, ముంబయి వేర్వేరు గ్రూప్స్​లో

author img

By

Published : Feb 25, 2022, 5:12 PM IST

Updated : Feb 25, 2022, 5:43 PM IST

ఐపీఎల్​ను ఈసారి సరికొత్త ఫార్మాట్​లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గ్రూప్స్​కు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. కొత్త జట్టు లక్నో సూపర్​ జెయింట్స్​కు గ్రూప్​ ఏలో చోటు దక్కగా.. మరో కొత్త టీమ్​ గుజరాత్​ టైటాన్స్​ గ్రూప్​ బీలో స్థానం సంపాదించింది.

ipl
ఐపీఎల్​

IPL 2022 Teams: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్​ సందడి ప్రారంభం కానుంది. ఈసారి కొత్తగా మరో రెండు జట్ల ఎంట్రీతో వినోదం రెండింతలు అవుతుంది. మ్యాచ్​ వేదికలకు సంబంధించి ఇప్పటికే ప్రకటన విడుదల చేసిన నిర్వహకులు.. ఇప్పుడు జట్లను గ్రూప్స్​గా విడదీసి, అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రెండు గ్రూప్​లను ఏర్పాటు చేసి, పది జట్లలో ఐదు జట్లకు గ్రూప్​ ఏ, మిగతా వాటికి గ్రూప్​ బీలో చేర్చారు.

ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​, రాజస్థాన్​ రాయల్స్​ సహా కొత్త జట్టు లక్నో సూపర్​ జెయింట్స్​ గ్రూప్​లో ఏలో ఉన్నాయి.

చెన్నై సూపర్​ కింగ్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, పంజాబ్​ కింగ్స్​ సహా మరో కొత్త జట్టు గుజరాత్​ టైటాన్స్​ గ్రూప్​ బీలో ఉన్నాయి.

ఆ జట్ల మధ్య రెండు మ్యాచ్​లు..

ఓ గ్రూప్​లో ఉన్న జట్టు లీగ్​ దశలో అదే గ్రూప్​లో ఉన్న జట్లతో రెండేసి మ్యాచ్​లు ఆడుతుంది. ఉదాహరణకు.. గ్రూప్​ ఏలో ఉన్న ముంబయి ఇండియన్స్ అదే గ్రూప్​లోని కోల్​కతా​, రాజస్థాన్​, దిల్లీ, లక్నో జట్లతో తలో రెండు మ్యాచ్​ల్లో తలపడుతుంది. గ్రూప్​ బీలోని చెన్నైతో రెండు మ్యాచ్​లు ఆడనుంది. అదే గ్రూప్​లోని మిగిలిన జట్లతో చెరో ఒక మ్యాచ్​ ఆడుతుంది.

గ్రూప్​ బీలో ఉన్న ఆర్​సీబీ కూడా గ్రూప్​ ఏలో రాజస్థాన్​ రాయల్స్​తో రెండు మ్యాచ్​లు ఆడుతుంది. ఆ గ్రూప్​లో ఉన్న ఇతర టీమ్స్​తో ఒక్కో మ్యాచ్​ ఆడుతుంది. మరోవైపు సొంత గ్రూప్​లోని జట్లతో రెండు మ్యాచ్​లతో తలపడుతుంది.

ఈ ఏడాది మార్చి 26న ప్రారంభం కానున్న ఈ లీగ్​ మే 29తో ముగుస్తుంది. ఈసారి ఐపీఎల్ మ్యాచులన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయి. ముంబయిలో 55, పుణెలో 15 మ్యాచ్​ల్ని నిర్వహిస్తారు. వీటిలో వాంఖడే 20, బ్రబోర్న్ 20, డీవై పాటిల్ స్టేడియం 15, ఎమ్​సీఏ గ్రౌండ్​ 15 మ్యాచ్​ల​కు ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇదీ చూడండి : అతడు ఒక్క ఇన్నింగ్స్​ ఆడితే చాలు.. లెక్క సరిపోతుంది: రోహిత్

Last Updated : Feb 25, 2022, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.