ETV Bharat / sports

మరో 7 ఫోర్లు కొడితే ధావన్​ అరుదైన రికార్డు.. తొలి భారత బ్యాటర్​గా!​ - csk vs pbks

Shikhar Dhawan IPL 2022: ఐపీఎల్​ 2022లో భాగంగా ఆదివారం.. చెన్నై సూపర్​ కింగ్స్​తో తలపడనుంది పంజాబ్​ కింగ్స్​. ఈ మ్యాచ్​లో రాణించి.. పలు రికార్డులను అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు పంజాబ్​ ఓపెనర్​ శిఖర్​ ధావన్​. రాత్రి 7.30 గంటలకు ముంబయి బ్రబౌర్న్​ స్టేడియంలో మ్యాచ్​ జరగనుంది.

Shikhar Dhawan sets eye on Virat Kohli's massive record against CSK

author img

By

Published : Apr 3, 2022, 3:55 PM IST

Shikhar Dhawan IPL 2022: పంజాబ్​ కింగ్స్​.. ఐపీఎల్​లో రెండో విజయం కోసం చూస్తోంది. నేడు (ఆదివారం) చెన్నై సూపర్​ కింగ్స్​తో తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ముంబయి బ్రబౌర్న్​ స్టేడియంలో మ్యాచ్​ జరగనుంది. మరోవైపు.. చెన్నై ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. అయితే.. ఈ మ్యాచ్​లో రాణిస్తే పంజాబ్​ ఓపెనర్​ శిఖర్​ ధావన్​ పలు రికార్డుల్ని ఖాతాలో వేసుకోనున్నాడు.

చెన్నై సూపర్​ కింగ్స్​పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్​ 948 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. మరో 41 పరుగులు చేస్తే ధావన్.. విరాట్​ను అధిగమిస్తాడు. అంతేకాకుండా మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు శిఖర్​. మరో 7 బౌండరీలు సాధిస్తే.. టీ20ల్లో 1000 ఫోర్లు బాదిన తొలి భారత క్రికెటర్​గా నిలుస్తాడు. ప్రస్తుతం ధావన్​ టీ20ల్లో 993 ఫోర్లు సాధించాడు. ఈ జాబితాలో క్రిస్​ గేల్​(విండీస్​) 1132 ఫోర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అలెక్స్​ హేల్స్​(ఇంగ్లాండ్​) 1054, డేవిడ్​ వార్నర్​ (ఆసీస్)​ 1005 వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

భారతీయుల్లో.. ధావన్​ తర్వాతి స్థానంలో విరాట్​ కోహ్లీ(917), రోహిత్​ శర్మ (875) ఉన్నారు. ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలోనూ ధావన్​(5843) రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్​ 6 వేలకుపైగా పరుగులతో టాప్​లో ఉన్నాడు. కొన్నేళ్లుగా దిల్లీకి ఆడిన శిఖర్​ ధావన్​ను 2022 ఐపీఎల్​ వేలంలో రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్​ కింగ్స్​.

ఇవీ చూడండి: ఐపీఎల్​ మ్యాచ్​.. ముద్దుల్లో మునిగిపోయిన జంట.. నెట్టింట వైరల్​!

ఆ రికార్డుల​పై కన్నేసిన ధోనీ.. మరో 3 సిక్స్​లు కొడితే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.