ETV Bharat / sports

దశాబ్దాల కల వేటలో ఆర్సీబీ-పంజాబ్​.. నేడే ఇరు జట్ల ఢీ - విరాట్​ కోహ్లీ న్యూస్​

IPL 2022 RCB VS PBKS: టైటిల్​ కోసం ఐపీఎల్​ ఆరంభం నుంచి పోరాడుతున్నాయి రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్​ కింగ్స్​ జట్లు. దశాబ్దాల తీరని కలను నెరవేర్చుకోవడానికి 15వ సీజన్​లో కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో చూడండి.

IPL 2022 news
RCB VS PBKS news
author img

By

Published : Mar 27, 2022, 12:39 PM IST

IPL 2022 RCB VS PBKS: ఐపీఎల్​ 15వ సీజన్‌లో తొలి పోరుకు సిద్ధమైంది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు. ముంబయి వేదికగా పంజాబ్​ కింగ్స్​తో నేడు (ఆదివారం) తలపడనుంది. మూడు సార్లు ఫైనల్​ చేరినా.. ఆర్సీబీకి ట్రోఫీ గెలవడం ఇంకా కలగానే మిగిలింది. దశాబ్దకాలం కెప్టెన్​గా వ్యవరించి ఈ సీజన్​లో కేవలం ఆటగాడినే బరిలోకి దిగనున్నాడు కోహ్లీ. మ్యాచ్​లో అతడిపైనే అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు పంజాబ్​ కూడా ఇప్పటివరకు ఐపీఎల్​ టైటిల్​ గెలవలేదు. నూతన సారథి మయాంక్‌ నాయకత్వంలోనైనా ఆ జట్టు రాత మారుతుందేమో చూడాలి.

కోహ్లీతో ప్రత్యర్థికి కష్టమే!

గతేడాది చెన్నై కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఫాఫ్​ డుప్లెసిస్​ను జట్టులోకి తీసుకొని సారథిగా నియమించింది ఆర్సీబీ. అతడితో పాటు కెప్టెన్సీ ఒత్తిడి లేని కోహ్లీ స్వేచ్ఛగా ఆడితే.. ప్రత్యర్థి జట్టుకు ముప్పు తప్పదు. మరోవైపు స్టార్ ప్లేయర్లు మ్యాక్స్​వెల్​, బౌలర్​ హేజిల్​వుడ్​ తొలి మ్యాచులకు దూరంకానుండడం ఆర్సీబీకి ఎదురుదెబ్బే. శ్రీలంక ఆల్​రౌండర్​ హసరంగ ఫామ్​లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్​లో సిరాజ్​, హర్షల్​ పటేల్​ కీలకం కానున్నారు. దినేశ్​ కార్తీక్​ తొలిసారిగా ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

కొత్త కెప్టెన్​ రాణిస్తాడా?

పంజాబ్​ కింగ్స్​ కూడా కొత్త కెప్టెన్​తోనే బరిలోకి దిగనుంది. గతేడాది సారథిగా ఉన్న కేఎల్​ రాహుల్..​ లఖ్​నవూకు మారడం వల్ల ఆ బాధ్యతను మయాంక్​కు అప్పగించారు. ప్రధాన ఆటగాళ్లు జానీ బెయిర్​స్టో, కగిసో రబాడ ఈ మ్యాచ్​కు అందుబాటులో లేకపోవడం పంజాబ్​కు ఎదురుదెబ్బే. అన్ని దేశవాళీ ఫార్మాట్లలో సత్తాచాటుతూ వస్తున్న షారుక్​ఖాన్​.. ఐపీఎల్​లోనూ రాణించాలని పంజాబ్​ ఆశిస్తోంది.

హెడ్​ టూ హెడ్​: ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 28 సార్లు తలపడ్డాయి. 15 మ్యాచుల్లో పంజాబ్​ కింగ్స్​ గెలిచింది. 13 మ్యాచుల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ముంబయిలోని డీవై పాటిల్​ స్టేడియం వేదికగా సాయంత్రం 07:30 గంటలకు నేడు (ఆదివారం) మ్యాచ్​ జరగనుంది.

ఇదీ చదవండి: Ipl 2022: ఆరో టైటిల్​ వేటలో ముంబయి.. దిల్లీతో నేడే తొలి పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.