IPL 2022 RAVISHASTRI: ఐపీఎల్ ప్రపంచంలో గొప్ప ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తుందని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. గాయపడ్డ ప్లేయర్లంతా ఐపీఎల్ వేలానికి ముందు ఫిట్‌గా తయారవుతారని ఎద్దేవా చేశాడు. క్రికెట్ వర్గాల్లో చాలా మంది ఇదే భావనలో ఉన్నారని, సాధారణ వ్యక్తులు సైతం ఇదే అనుకుంటున్నారని చెప్పుకొచ్చాడు.
greatest physiotherapists IPL
మరోవైపు, ఐపీఎల్లో అధిక ధరలు పలికిన యువకులకు కీలక సూచనలు చేశారు శాస్త్రి. డబ్బుల విషయాన్ని మర్చిపోయి.. గేమ్ బేసిక్స్‌పై దృష్టిపెట్టాలన్నాడు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించాడు. యువకులపై ఒత్తిడి తగ్గించే బాధ్యత కెప్టెన్లపై ఉంటుందని అన్నాడు.
భారత జాతీయ జట్టుకు తదుపరి కెప్టెన్ విషయంపై మాట్లాడిన శాస్త్రి.. ఈ ఐపీఎల్లో ఆశావాహులు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. తర్వాతి తరం కెప్టెన్లను అన్వేషించడమే ఈ సీజన్ ప్రత్యేకత అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ.. జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడని ప్రశంసించాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లకు భారత తదుపరి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.
ఐపీఎల్ వల్ల కొత్త ప్లేయర్లను కనిపెట్టడం సులభమైందని అన్నాడు శాస్త్రి. 'వెంకటేష్ అయ్యర్ గురించి అప్పటివరకూ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు జాతీయ జట్టుకు ఆడుతున్నాడు. అదే ఐపీఎల్ ప్రత్యేకత. ఇక, ఐపీఎల్లో హార్దిక్ పాండ్యను దేశమంతా గమనిస్తుంటుంది. అతడు బౌలింగ్ చేస్తాడా? లేదా? అనేది చూడాల్సి ఉంది' అని అన్నాడు.
ఇదీ చదవండి:
కామెంట్రీ బాక్స్‌లోకి రవిశాస్త్రి రిటర్న్.. రైనా అరంగేట్రం...