ETV Bharat / sports

IPL 2022: కోహ్లీ ఆశలన్నీ రోహిత్​పైనే.. మరి హిట్​మ్యాన్​ ఏం చేస్తాడో? - ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ ఆర్సీబీ

IPL 2022 Playoffs Mumbai vs Delhi vs RCB: బెంగళూరు ఆశలన్నీ ఇప్పుడు ముంబయిపైనే నెలకొన్నాయి. ప్లేఆఫ్స్​ రేసులో భాగంగా దాని భవితవ్యం ముంబయి, దిల్లీ జట్ల ఫలితంపై ఆధారపడింది. శనివారం రాత్రి జరిగే ఈ మ్యాచ్‌లో దిల్లీ గెలిస్తే తదుపరి దశకు చేరుకుంటుంది. ఒకవేళ ముంబయి గెలిస్తే బెంగళూరుకు అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో ముంబయి గెలవాలని ఆర్సీబీ అభిమానులతో సహా ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి..

IPL 2022 Playoffs Mumbai vs Delhi vs RCB
ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ ఆర్సీబీ
author img

By

Published : May 21, 2022, 4:08 PM IST

Updated : May 21, 2022, 5:50 PM IST

IPL 2022 Playoffs Mumbai vs Delhi vs RCB: భారత టీ20 టోర్నీలో లీగ్‌ దశ చివరి దశకు చేరింది. గుజరాత్‌, రాజస్థాన్‌, లఖ్‌నవూ జట్లు తొలి మూడు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్​లోకి ప్రవేశించాయి. ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం దిల్లీ, బెంగళూరు జట్లు పోటీపడుతున్నాయి. ఆ ఉత్కంఠకు కూడా ఈరోజు(శనివారం) రాత్రి దిల్లీ, ముంబయి జట్ల మధ్య జరిగే పోరుతో తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆశలన్నీ ఇప్పుడు ముంబయిపైనే నెలకొన్నాయి. మే 19న డుప్లెసిస్‌ టీమ్ గుజరాత్‌పై గెలవడం వల్ల ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే, ఆ జట్టు నెట్‌రన్‌రేట్‌ (-0.253) తక్కువగా ఉండటంతో దాని భవితవ్యం ముంబయి, దిల్లీ మ్యాచ్​ ఫలితంపై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో దిల్లీ గెలిస్తే తదుపరి దశకు చేరుకుంటుంది. ఒకవేళ ముంబయి గెలిస్తే బెంగళూరుకు అవకాశం దక్కుతుంది.

దీంతో ముంబయి గెలవాలని బెంగళూరు అభిమానులతో సహా ఆ జట్టుకు చెందిన డుప్లెసిస్​, కోహ్లీ, దినేశ్ కార్తీక్​తో పాటు మిగతా ప్లేయర్స్​ కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీ, డుప్లెసిస్​ చెప్పారు. ఇప్పుడు ముంబయి గెలవాలని, అందుకోసం తాము ఇద్దరమే కాకుండా తమ జట్టులోని 25 మంది మద్దతు కూడా ముంబయికే ఉంటుందన్నారు. వీలైతే తమని ముంబయి, దిల్లీ మ్యాచ్‌లో చూడొచ్చని కూడా అన్నారు. ఇక దినేశ్​కార్తీక్​ గతంలో ముంబయి ఇండియన్స్​కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు ముంబయి జెర్సీ ధరించిన పాత పిక్​ను పోస్ట్​ చేసి ముంబయికి తన మద్దతును తెలిపాడు. మరోవైపు.. బెంగళూరు యాజమాన్యం కూడా తమ మద్దతు ముంబయికే అని సోషల్​మీడియా ద్వారా తెలిపింది. ఏకంగా తమ ట్విట్టర్ ప్రొఫైల్‌ పిక్‌నే మార్చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో నీలం రంగు(ముంబయి జెర్సీ కలర్​) వచ్చేలా డిజైన్‌ చేసింది. గతంలో ఎర్ర రంగు ఉండే స్థానంలో బ్లూ కలర్‌తో నింపేసింది.

ఇంచుమించు సమఉజ్జీలే.. ఈ సీజన్‌లో ముంబయి ఎంత దారుణంగా ఆడినా గత ఐదు మ్యాచ్‌ల్లో దిల్లీ మాదిరే మూడు విజయాలు, రెండు ఓటములతో నిలిచింది. అంటే ఈ లెక్కన ప్రస్తుతం రెండు జట్లూ ఇంచుమించు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. కానీ, దిల్లీ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండి ప్లేఆఫ్స్‌ కోసం పోటీపడుతుండటంతో ఈ మ్యాచ్‌ను అంత తేలిగ్గా తీసుకోదనేది కాదనలేని సత్యం. మరోవైపు ముంబయి ఈ సీజన్‌లో కేవలం మూడు విజయాలే సాధించడంతో చివరి మ్యాచ్‌లోనైనా గెలుపొంది కనీసం తొమ్మిదో స్థానంలో నిలిచిన చెన్నై మాదిరే కాస్త గౌరవప్రదంగా తిరుగుముఖం పట్టాలని చూస్తోంది. దీంతో రెండు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

రోహిత్‌ ఏం చేస్తాడో.. ఇక ముంబయి బ్యాటింగ్‌ విషయానికి వస్తే ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ సీజన్‌ ఆరంభంలో విఫలమైనా ఇటీవల కాస్త మెరుగైనట్లు కనిపిస్తున్నారు. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై తొలి వికెట్‌కు వీరిద్దరు 95 పరుగులు జోడించారు. అదే జోరును ఈరోజు కూడా కొనసాగిస్తే దిల్లీకి కష్టాలు తప్పకపోవచ్చు. ఇషాన్‌ ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేయగా మూడు అర్ధశతకాలు సాధించాడు. అలాగే యువ బ్యాట్స్‌మన్‌ తిలక్‌ వర్మ కూడా అన్ని మ్యాచ్‌ల్లో 376 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో రెండు అర్ధశతకాలు సాధించాడు. కెప్టెన్‌ రోహిత్‌ 13 మ్యాచ్‌ల్లో (266) పరుగులు చేసినా ఒక్క అర్ధశతకం నమోదు చేయలేదు. దీంతో చివరి మ్యాచ్‌లోనైనా అతడు చెలరేగి ఆడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు సూర్యకుమార్‌ (303) ఇంతకుముందే గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఇక మిగిలినవారిలో పొలార్డ్‌ (144) పరుగులే చేశాడు. దీంతో దిల్లీలాగే ముంబయి బ్యాటింగ్‌ లైనప్‌ కూడా ఏమంత చెప్పుకునే స్థితిలో లేదు. మరోవైపు ముంబయి బౌలింగ్‌ కూడా పూర్తిగా గాడితప్పింది. ఈ మధ్య బుమ్రా (13), డేనియల్‌ సామ్స్‌ (12) రాణించడం కాస్త ఊరటనిచ్చే విషయం. మురుగన్‌ అశ్విన్‌ (9) వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నాడు.

ఆందోళనలో ఆర్సీబీ ఫ్యాన్స్​.. అయితే ఇటీవలే కెప్టెన్​ రోహిత్​ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్​లో అవకాశం రాని యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తామని చెప్పాడు. విజయం కన్నా భవిష్యత్​ నేపథ్యంలో కోర్​ టీమ్​ను పరీక్షించుకోవడం తమకు ముఖ్యమని చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలు ఆర్సీబీ అభిమానులను కలవరపెట్టాయి. రోహిత్​ కామెంట్స్​ను బట్టి.. ఇప్పటివరకు జట్టులో అవకాశం దక్కించుకోని అర్జున్ తెందుల్కర్​తో పాటు మిగతా ప్లేయర్స్​ అరంగేట్రం చేసే ఛాన్స్​లు ఉన్నాయి. తాను నెట్స్​లో శ్రమించే ఫొటోలను తాజాగా అర్జున్​ పోస్ట్ చేశాడు. ఓకవేళ కొత్తవారికి ఛాన్స్ వస్తే.. ఇషాన్ కిషన్​, బుమ్రా, రమణ్​ దీప్​, తిలక్ వర్మ లాంటి ఆటగాళ్లను తప్పించాల్సి ఉంటుంది. అప్పుడు ముంబయి ఇండియన్స్​ గెలిచే అవకాశాలు మరింత సన్నగిల్లుతాయి. ఇది దిల్లీకి లాభం అనడంలో సందేహం లేదు. ప్లే ఆఫ్స్​కు మార్గం సుగమం అవుతుంది. ఆర్సీబీకి కష్టం అవుతుంది. దీంతో బెంగళూరు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

వార్నర్​ ఆదుకుంటేనే.. ఈ సీజన్‌ ఆరంభం నుంచి గెలుపోటములతో దాగుడుమూతలు ఆడుతూ ఇక్కడిదాకా చేరుకున్న దిల్లీ గత రెండు మ్యాచ్‌ల్లోనే వరుసగా విజయాలు సాధించడం గమనార్హం. అయితే, రోహిత్ టీమ్‌ బౌలర్లు సరిగ్గా బౌలింగ్‌ చేస్తే.. దిల్లీని కట్టడి చేయడం పెద్ద కష్టమేం కాదు. ప్రస్తుతం ఆ జట్టులో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (427) ఒక్కడే రాణిస్తున్నాడు. అతడు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 అర్ధ శతకాలతో.. 53.38 మంచి సగటుతో కొనసాగుతున్నాడు. కెప్టెన్‌ రిషభ్‌పంత్‌ 13 మ్యాచ్‌ల్లో (301) పరుగులతో ఏమంత ప్రభావం చూపలేకపోతున్నాడు. అతడు ఇప్పటివరకు ఒక్క అర్ధశతకం కూడా సాధించలేదు. మరో ఓపెనర్‌ పృథ్వీ షా (259) కాస్త ఫరవాలేదనిపించినా అనారోగ్యంతో ఇప్పుడు తుదిజట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక విదేశీ ఆటగాళ్లు మిచెల్‌ మార్ష్‌ (251), రోమన్‌ పావెల్‌ (207) కూడా పెద్ద ప్రమాదకరంగా కనిపించడం లేదు. దీంతో టాప్‌ ఆర్డర్‌లో వార్నర్‌ను కట్టడి చేస్తే సగం మ్యాచ్‌ గెలిచినట్లే. దిల్లీ బౌలింగ్‌లో కుల్‌దీప్‌ (20), ఖలీల్‌ అహ్మద్‌ (16) పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ వికెట్లు పడగొడుతున్నారు. శార్దూల్‌ ఠాకూర్‌ (13) తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.

ఇదీ చూడండి: Thaliand Open: సెమీస్​లో సింధు ఓటమి.. టోర్నీ నుంచి ఔట్

Last Updated : May 21, 2022, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.