Lucknow Franchise trending names: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూ జోరు మీదుంది. ఇప్పటికే కోచ్, మెంటార్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ పేర్లను ప్రకటించిన యాజమాన్యం.. ఇప్పుడు జట్టు పేరు ఖరారు చేసే పనిలో పడింది. అందుకోసం సామాజిక మాధ్యమాల్లో కొన్ని సూచనలు కోరింది. దీంతో పలువురు ఫ్రాంచైజీకి పేరు సూచిస్తూ ట్వీట్లు చేశారు. ఇందులో కొన్ని పేర్లు యాజమాన్యం దృష్టికి వచ్చినట్లు సమాచారం.
టాప్‌లో ఈ పేర్లు!
లఖ్‌నవూ నవాబ్స్, లఖ్‌నవూ బ్రేవ్ హర్ట్స్, రైజింగ్ లఖ్‌నవూ జాయింట్స్, లఖ్‌నవూ గ్లాడియేటర్స్, లఖ్‌నవూ కింగ్స్, లఖ్‌నవూ స్టీలర్స్, లఖ్‌నవూ బేర్స్.
లఖ్‌నవూ కోచ్‌గా ఆండీ.. మెంటార్‌గా గంభీర్
Andy Flower Lucknow Franchise: జింబాబ్వే జట్టు మాజీ సారథి ఆండీ ఫ్లవర్.. లఖ్‌నవూ జట్టు హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాడు. ఆండీ ఫ్లవర్ అంతకుముందు పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా చేశాడు. అలాగే అసిస్టెంట్ కోచ్‌గా విజయ్ దహియా నియామకాన్ని ఖరారు చేశారు. ఇక ఈ ఫ్రాంచైజీకి మెంటార్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను నియమించింది యాజమాన్యం.
2022 IPL Teams: 2022 ఐపీఎల్ సీజన్లో ఈ సారి 10జట్లు పోటీపడనున్నాయి. లఖ్‌నవూ, అహ్మదాబాద్ జట్లు తొలిసారిగా ఐపీఎల్ బరిలోకి దిగనున్నాయి. లఖ్‌నవూ ఐపీఎల్ జట్టును ఆర్పీఎస్జీ గ్రూప్ కొనుగోలు చేసింది.