ETV Bharat / sports

ఆత్మవిశ్వాసంతో పంజాబ్​.. రెండో విజయం కోసం కేకేఆర్​తో ఢీ - ipl updtes

IPL 2022 KKR VS PBKS: ఐపీఎల్​ 2022 సీజన్​లో నేడు మరో ఆసక్తికర మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. సీజన్​ను విజయంతో ఆరంభించిన పంజాబ్​, తొలి మ్యాచ్​ నెగ్గి, రెండో దాంట్లో ఓడిన కోల్​కతా మధ్య మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను చూద్దాం.

ipl-2022-kkr-vs-pbks-match
ipl-2022-kkr-vs-pbks-match
author img

By

Published : Apr 1, 2022, 12:13 PM IST

IPL 2022 KKR VS PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్​లో నేడు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. రెండు సార్లు లీగ్​ విజేత కోల్​కతా నైట్​రైడర్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని కోల్​కతా జట్టు.. తన ఆరంభ మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘనవిజయం సాధించి శుభారంభం చేసింది. అయితే అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ఊహించని విధంగా విఫలమై ఓటమిని మూట గట్టుకుంది. మరో వైపు తొలి మ్యాచ్​లోనే బెంగళూరును జట్టును ఓడించిన పంజాబ్​ కింగ్స్ మరో విజయంపై కన్నేసింది.

శ్రేయస్​ను భయపెడుతున్న రసెల్ గాయం: కోల్​కతా నైట్​రైడర్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లలో కరీబియన్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రీ రసెల్ ఒకడు. గాయాలతో తరచూ ఇబ్బంది పడే రసెల్.. తాజాగా మరోసారి గాయపడ్డాడు. ఇదే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్​ను భయపెడుతోంది. భారీ షాట్లతో విరుచుకుపడే రసెల్.. బంతితోనూ వికెట్లు తీయగలడు. అయితే ఇప్పుడు రసెల్ మ్యాచ్​కు దూరమవ్వడం కేకేఆర్​ను కలవరపెట్టే అంశం. ఓపెనర్లు అజింక్య రహానె, వెంకటేశ్​ అయ్యర్​లు కూడా ధాటిగా ఆడాల్సి ఉంది. ఇక వరుణ్ చక్రవర్తి రూపంలో కేకేఆర్​ను మరో సమస్య వెంటాడుతోంది. మిస్టర్​ స్పిన్నర్​గా పేరు గాంచిన అతడు.. ఆడిన రెండు మ్యాచుల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. పేసర్ ఉమేష్ యాదవ్ రెండు గేమ్‌ల్లోనూ అద్భుతంగా రాణించగా.. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ కీలక పాత్ర పోషించాడు.

దూకుడు మీదున్న పంజాబ్ కింగ్స్: ఆర్సీబీ లాంటి జట్టు నిర్దేశించిన 206 పరుగులు లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించడం అంటే మామూలు విషయం కాదు. కానీ, పంజాబ్ దాన్ని చేసి చూపించింది. కెప్టెన్​ మయాంక్, శిఖర్ ధావన్, భానుక రాజపక్సలు అద్భుతంగా రాణించారు. వారితో పాటు చివర్లో ఒడెన్ స్మిత్, షారుఖ్ ఖాన్ ఆ మ్యాచ్​లో చెలరేగిపోయారు. ఐపీఎల్‌ అరంగేట్రంలోనే విఫలమైన అండర్‌-19 ప్రపంచకప్‌ స్టార్‌ రాజ్‌ బావాకు మరో అవకాశం దక్కుతుందేమో చూడాలి. అయితే బౌలర్లు రాహుల్​ చాహర్​, సందీప్​ శర్మ, అర్ష్​దీప్​ సింగ్​ ఈ సారి మెరుగ్గా రాణించాలి.

హెడ్ టు హెడ్​: ఇరు జట్ల ముఖాముఖి పోరులో కేకేఆర్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేకేఆర్, పంజాబ్ జట్లు ఇప్పటివరకు 29 మ్యాచులు ఆడాయి. ఇందులో కేకేఆర్ 19 మ్యాచుల్లో విజయం సాధిస్తే.. పంజాబ్ 10 మ్యాచుల్లో నెగ్గింది.

ఇదీ చదవండి: ఐపీఎల్‌ అభిమానులకు మరో గుడ్​న్యూస్​.. త్వరలోనే బీసీసీఐ ప్రకటన?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.