IPL 2022 KKR Captain: ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఉంటాడని టీమ్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది. దీనిపై శ్రేయస్ మాట్లాడుతూ.."కేకేఆర్ సారథిగా బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నాను. వివిధ దేశాల ఆటగాళ్లు ఉండే జట్టును నడిపించడం గొప్ప అవకాశం. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఒకే చోటుకు చేర్చడం ఐపీఎల్ ప్రత్యేకత. నాకు ఈ అవకాశాన్నిచ్చిన కేకేఆర్ యాజమాన్యానికి ధన్యవాదాలు. సమష్టిగా రాణించి మా జట్టుకు విజయాలు అందిస్తాం' అని అన్నాడు.
-
Skipp-Iyer 🤝 Kolkata 🤝 Knight Riders
— KolkataKnightRiders (@KKRiders) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Stepping into the new era of #GalaxyOfKnights 🔥 @ShreyasIyer15 #IPL2022 #ShreyasIyer #KKR #CricketTwitter #AmiKKR pic.twitter.com/eEZjHLstyZ
">Skipp-Iyer 🤝 Kolkata 🤝 Knight Riders
— KolkataKnightRiders (@KKRiders) February 16, 2022
Stepping into the new era of #GalaxyOfKnights 🔥 @ShreyasIyer15 #IPL2022 #ShreyasIyer #KKR #CricketTwitter #AmiKKR pic.twitter.com/eEZjHLstyZSkipp-Iyer 🤝 Kolkata 🤝 Knight Riders
— KolkataKnightRiders (@KKRiders) February 16, 2022
Stepping into the new era of #GalaxyOfKnights 🔥 @ShreyasIyer15 #IPL2022 #ShreyasIyer #KKR #CricketTwitter #AmiKKR pic.twitter.com/eEZjHLstyZ
గత ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన శ్రేయస్‌ను ఈ సారి మెగా వేలంలో కోల్‌కతా జట్టు సొంతం చేసుకుంది. ఇతని కోసం రూ. 15.25 కోట్లు కేటాయించింది. కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయస్ నియామకంపై కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మాట్లాడుతూ.. "మంచి భవిష్యత్తు ఉన్న భారత ఆటగాడు మా జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంపై ఆనందంగా ఉన్నాం. శ్రేయస్ ఆట, కెప్టెన్ స్కిల్స్‌ను నేను చాలా ఎంజాయ్ చేస్తాను. శ్రేయస్‌తో కలిసి పనిచేసి కేకేఆర్‌కు విజయాన్ని అందిస్తాం" అని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ వేలంలో అందుకే మా ఇద్దరిని కొనలేదు: రిచర్డ్సన్