ETV Bharat / sports

'తక్కువ అంచనా వేయొద్దు'.. ఇతర జట్లకు హార్దిక్​ హెచ్చరిక - గుజరాత్ టైటాన్స్​

Hardik Pandya: ఐపీఎల్​ 2022 త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇతర జట్లను హెచ్చరించాడు గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్ హార్దిక్ పాండ్య. తమను తేలికగా తీసుకోవద్దని వారించాడు.

Hardik Pandya
గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​ హార్థిక్​ పాండ్యా
author img

By

Published : Mar 13, 2022, 11:35 PM IST

Hardik Pandya: తమది కొత్త జట్టని తక్కువ అంచనా వేయవద్దని అన్నాడు గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​ హార్దిక్​ పాండ్య. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఓ​ ప్రచార చిత్రంలో ఇతర జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ఇటీవలే విడుదలైన ఈ ప్రచార చిత్రం ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఆదివారం.. గుజరాత్​ జట్టు తమ జెర్సీని విడుదలచేసింది. ఈ కార్యక్రమంలో తన బౌలింగ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాండ్య. ఈ ఐపీఎల్​లో తన బౌలింగ్​ సర్​ప్రైజ్​గా నిలుస్తుందని చెప్పాడు. విజయాన్ని జట్టులోని ఆటగాళ్లకు ఇచ్చి, తాను ఓటములకు బాధ్యత తీసుకుంటానని అన్నాడు.

Hardik Pandya
గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​ హార్థిక్​ పాండ్య

ఈ ఏడాదిలోనే ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇచ్చాయి గుజరాత్​ టైటాన్స్​, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​. ఈ రెండు జట్లు మార్చి 28న తమ తొలి మ్యాచ్​లో పోటీ పడనున్నాయి.

ఇదీ చదవండి:కోహ్లీలా ఉండలేను.. ధోనీకి నాకూ పోలిక ఉంది: డుప్లెసిస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.