ETV Bharat / sports

ఐపీఎల్​ చివరి దశకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం! - ఐపీఎల్ 2022 న్యూస్

IPL 2022: ఐపీఎల్​ 15వ సీజన్​ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే మెగా వేలం ప్రక్రియ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్​ చివరిదశలో ఆడతారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది.

england
ఇంగ్లాండ్
author img

By

Published : Jan 28, 2022, 6:13 PM IST

IPL 2022: ఐపీఎల్​ 15వ సీజన్​ త్వరలోనే ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. అయితే.. ఐపీఎల్​ చివరి దశ మ్యాచ్​లకు ఇంగ్లాండ్​ టెస్టు జట్టుకు చెందిన ఆటగాళ్లు దూరం కానున్నట్లు తెలుస్తోంది. సొంతగడ్డపై న్యూజిలాండ్​తో సిరీస్​ నేపథ్యంలో.. తమ ఆటగాళ్లను ఇంగ్లాండ్ క్రికెట్​ బోర్డు (ఈసీబీ) వెనక్కి రప్పించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

మార్చి 27 నుంచి మే చివరి వరకు ఐపీఎల్​ టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. మొత్తంగా పది జట్లు 64 మ్యాచ్​లు ఆడనున్నాయి. ఈ నిర్ణీత వ్యవధిలోనే ఐపీఎల్​ జరిగితే.. ఇంగ్లాండ్ టెస్టు జట్టు ఆటగాళ్లు ప్లే ఆఫ్స్​ సమయంలోనే సొంతగడ్డకు బయలుదేరే అవకాశముంది. టెస్టు ఛాంపియన్​షిప్​ ప్రాధాన్యత దృష్ట్యా ఆటగాళ్లను ఈసీబీ వెనక్కిరప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్​ 2 నుంచే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య సిరీస్​ ప్రారంభంకానుంది. అయితే.. ఈసీబీ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఫ్రాంఛైజీలు చాలా డబ్బు వెచ్చించి ఆటగాళ్లను తీసుకుంటాయి. ఇలా సగంలో వదిలేసి వెళ్తే ఎలా?' అని కొందరు మండిపడుతున్నారు.

మరోవైపు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రం ముందుగానే వేలం కోసం తమ పేర్లను రిజిస్టర్​ చేసుకున్నారు. మొత్తంగా 22 మంది వేలంలో పాల్గొంటున్నారు. టెస్టు జట్టు సభ్యులైన జానీ బెయిర్​స్టో, మార్క్ వుడ్, డేవిడ్ మలన్, ఒలీ పోప్, ఓవర్టన్, సామ్ బిల్లింగ్స్, డాన్ లారెన్స్ ఈ జాబితాలో ఉన్నారు. కాగా, జాస్​ బట్లర్​ను రాజస్థాన్​ జట్టు రిటైన్ చేసుకుంది. బెన్​ స్టోక్స్, ఆర్చర్ మాత్రం వేలంలో పాల్గొనడం లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

'రోహిత్-రాహుల్ కాంబో అద్భుతం.. ప్రపంచకప్​ కోసం వెయిటింగ్'

పొలార్డ్​పై ఆరోపణలు.. క్లారిటీ ఇచ్చిన విండీస్ బోర్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.