ETV Bharat / sports

జేసన్​ రాయ్​ విధ్వంసం.. 36 బంతుల్లో సెంచరీ

Jason Roy century: ఇంగ్లాండ్​ బ్యాటర్ జేసన్​ రాయ్ తాజాగా జరిగిన ఓ మ్యాచ్​లో​​ 36 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో త్వరలో జరగనున్న ఐపీఎల్​ మెగా వేలంలో అతడిని భారీ ధరకు కొనుగోలు చేసే అవకాశముందని క్రికెట్​ వర్గాలు అంటున్నాయి.

jasonroy century
జేసన్​ రాయ్​ విధ్వంసం
author img

By

Published : Jan 20, 2022, 6:12 PM IST

Jason Roy century: వెస్టిండీస్​తో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు ముందు జరిగిన వార్మప్​ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ బ్యాటర్​ జేసన్​ రాయ్​ అదరగొట్టాడు. 36 బంతుల్లో 10 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. బార్బడోస్​ ప్రెసిడెంట్స్​ ఎలెవన్​తో జరిగిన మ్యాచ్​లో జేసన్​ ఈ మార్క్​ను అందుకున్నాడు.

కెన్సింగ్టన్​ ఓవల్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో మొత్తం 47 బంతులను ఎదుర్కొన్న జేసన్​ 115 పరుగులు చేశాడు. ఫలితంగా ఇంగ్లాండ్​ నాలుగు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ప్రత్యర్థి జట్టు కేవలం 137 రన్స్​కే చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లాండ్​ జట్టు విజయం సాధించింది.

జేసన్​ రాయ్​.. త్వరలోనే ఐపీఎల్​ మెగా వేలంలో పాల్గొనబోతున్నాడు. ఇప్పుడీ సునామీ ఇన్నింగ్స్​ ద్వారా అతడు ఈ మెగావేలంలో భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది. కాగా, అతడు గత ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహించాడు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
Australian open: రెండో రౌండ్​కు సానియా.. ముర్రే, ఎమ్మా ఔట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.