IPL 2022 CSK VS PBKS: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో నేడు (ఆదివారం) డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో మరికాసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించింది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు పంజాబ్.. రెండో విజయం కోసం ఆరాటపడుతోంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఇరు జట్లు 25 సార్లు తలపడగా, చెన్నై 15, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి.
తుది జట్ల వివరాలివే..
చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డన్, ప్రిటోరియస్, ముఖేశ్ చౌదరి.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్స, ఓడియన్ స్మిత్, లివింగ్ స్టోన్, షారుక్ ఖాన్, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా.
ఇదీ చదవండి: మరో 7 ఫోర్లు కొడితే ధావన్ అరుదైన రికార్డు.. తొలి భారత బ్యాటర్‌గా!