ETV Bharat / sports

IPL 2022: టాస్​ గెలిచిన లఖ్​నవూ.. చెన్నై బ్యాటింగ్​ - లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​

IPL 2022 CSK VS LSG: ఐపీఎల్​ 15వ సీజన్​లో భాగంగా బ్రబౌర్న్​ స్టేడియం వేదికగా లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ జట్ల మధ్య మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన లఖ్​నవూ జట్టు ఫీల్డింగ్​ ఎంచుకుంది.

IPL 2022 CSK VS LSG:
IPL 2022 CSK VS LSG:
author img

By

Published : Mar 31, 2022, 7:05 PM IST

Updated : Mar 31, 2022, 7:12 PM IST

IPL 2022 CSK VS LSG: ఐపీఎల్​ 2022 సీజన్​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తమ తొలి మ్యాచుల్లో ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలైన చెన్నై సూపర్​ కింగ్స్​, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ జట్లు నేడు(గురువారం)తలపడేందుకు సిద్ధమయ్యాయి. బ్రబౌర్న్​ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. టాస్​ గెలిచిన లఖ్​నవూ జట్టు ఫీల్డింగ్​ ఎంచుకుంది. చెన్నై జట్టుకు బ్యాటింగ్​ అప్పగించింది. మరి ఈ మ్యాచ్​లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

అరుదైన రికార్డుల చేరువలో ధోనీ, బ్రావో: చెన్నై సూపర్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో మెగా టీ20 లీగ్‌లో ఓ అతిగొప్ప రికార్డుపై కన్నేశాడు. లీగ్‌ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక పేస్‌ దిగ్గజం‌, ముంబయి మాజీ బౌలర్‌ లసిత్‌ మలింగ (170) సరసన కొనసాగుతున్న చెన్నై ఆల్‌రౌండర్‌.. ఈ రోజు లఖ్‌నవూతో జరగబోయే మ్యాచ్‌లో మరో వికెట్‌ సాధిస్తే తన పేరిట కొత్త రికార్డు నెలకొల్పనున్నాడు. ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో బ్రావో కోల్‌కతాపై 3 వికెట్లు తీశాడు. దీంతో అతడు మలింగ సరసన 170 వికెట్లతో సమానంగా నిలిచాడు. ఇక ఈ రోజు మలింగ ఎన్ని ఎక్కువ వికెట్లు సాధిస్తే.. అంతముందుకు దూసుకెళ్తాడు. మరో వైపు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అరుదైన క్లబ్​లోకి చేరనున్నాడు. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ధోనీ మరో 15 పరుగులు చేస్తే.. పొట్టి క్రికెట్‌లో 7000 పరుగుల మైలరాయిని చేరుకున్న ఐదో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ధోనీ ఖాతాలో 6985 పరుగులు ఉన్నాయి.

తుది జట్ల వివరాలివీ

లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​: కేఎల్​ రాహుల్​(కెప్టెన్​), క్వింటన్​ డికాక్​​, ఎవిన్​ లూయిస్​, మనీష్​ పాండే, దీపక్​ హుడా, కృనాల్​ పాండ్య, ఆయుష్​ బదోని, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్​, అవేశ్​ ఖాన్, ఆండ్రూ టై.

చెన్నై సూపర్​ కింగ్స్​: రవీంద్ర జడేజా(కెప్టెన్), రుతురాజ్​ గైక్వాడ్​, డెవాన్‌ కాన్వే , రాబిన్​ ఊతప్ప, అంబటి రాయుడు, శివమ్​ దుబె, ఎంఎస్​ ధోనీ, బ్రావో, ముఖేశ్​ చౌదరి, తూషార్​ దేశ్​పాండే, మొయిన్​ అలీ, డ్వేన్​​ ప్రీటోరియస్.

ఇదీ చదవండి: 'ఫుట్​బాల్​కు రొనాల్డో.. క్రికెట్​కు విరాట్ కోహ్లీ'

Last Updated : Mar 31, 2022, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.