ETV Bharat / sports

IPL 2022: టాస్​ గెలిచిన కోల్​కతా.. సీఎస్​కే బ్యాటింగ్​ - చెన్నై సూపర్​ కింగ్స్​

IPL 2022 CSK vs KKR: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్​ 15వ సీజన్​ నేడు(శనివారం)ప్రారంభం కానుంది. డిఫెండింగ్​ ఛాంపియన్​ చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​ కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య తొలిమ్యాచ్​ ఈ రోజు రాత్రి 7.30 గంటలకు జరగనుంది. మ్యాచ్​లో​ భాగంగా ముందుగా టాస్​ నెగ్గిన కోల్​కతా నైట్​ రైడర్స్​ ఫీల్డింగ్​​ ఎంచుకుంది.

csk kkr
ipl 2022
author img

By

Published : Mar 26, 2022, 7:04 PM IST

Updated : Mar 26, 2022, 7:15 PM IST

IPL 2022 CSK vs KKR: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్‌ పండగ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్​ 15వ సీజన్​ తొలి మ్యాచ్​ జరగనుంది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్ల మధ్య నేడు(శనివారం)మ్యాచ్‌ జరుగనుంది. మొదటగా ఈ మ్యాచ్​లో భాగంగా టాస్​ గెలుచుకున్న కోల్​కతా జట్టు ఫీల్డింగ్​​ ఎంచుకుంది. దీంతో సీఎస్​కే బ్యాటింగ్​కు దిగనుంది.

కాగా, ఇరు జట్లు ఈ ఏడాది కొత్త సారథులతో బరిలోకి దిగనున్నాయి. గత సీజన్‌లో కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్‌ మోర్గాన్‌ యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు జట్టు యాజమాన్యం బాధ్యతలు అప్పగించింది. ఇటు చెన్నై కెప్టెన్​గా ధోనీ కూడా కెప్టెన్సీకి గుడ్​ బై చెప్పడం వల్ల ఆల్ రౌండర్‌ రవీంద్ర జడేజాను సారథిగా ఎంపిక చేసింది సీఎస్​కే. ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా.. 17 మ్యాచుల్లో చెన్నై, 8 మ్యాచుల్లో కేకేఆర్ గెలుపొందాయి. మరో మ్యాచ్​లో ఫలితం తేలలేదు.

జట్లు

కోల్​కతా నైట్​రైడర్స్​: వెంకటేష్​ అయ్యర్​, అజింక్య రహెనే, శ్రేయస్​ అయ్యర్​(కెప్టెన్​), నితీశ్​ రానా, సామ్​ బిల్లింగ్స్, ఆండ్రూ రుసెల్​, సునీల్ నరైన్​, జాక్సన్​, ఉమేశ్​ యాదవ్​, శివం మవి, వరుణ్​ చక్రవర్తి

చెన్నై సూపర్​ కింగ్స్​: రుతురాజ్​ గైక్వాడ్​, దేవన్​ కోన్వే, రోబిన్​ ఊతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్​ దుబె, ఎంఎస్​ ధోనీ, బ్రావో, మిచెల్​ సాంట్నర్​, అడమ్​ మిల్నే, తూషార్​ దేశ్​పాండే

ఇదీ చదవండి: 'కొత్త జట్ల రాకతో ఐపీఎల్​ నాణ్యత దెబ్బతింటుంది..కానీ'

Last Updated : Mar 26, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.