ETV Bharat / sports

'ధోనీని క్లీన్‌బౌల్డ్ చేశా.. ఈసారి నా టార్గెట్ విరాట్ కోహ్లీ'

IPL 2022 Chetan Sakaria: గతేడాది ఐపీఎల్​లో చెన్నై జట్టు కెప్టెన్​ ధోనీని క్లీన్​ బౌల్డ్​ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు గుజరాత్​ కుర్రాడు చేతన్​ సకారియా. గతేడాది రాజస్థాన్​ రాయల్స్​కు అతడిని ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్​లో విరాట్​ కోహ్లీ వికెట్​ తీయడమే తన ముందున్న లక్ష్యమని చేతన్ తెలిపాడు.

author img

By

Published : Mar 19, 2022, 10:26 PM IST

ipl 2022
virat kohli

IPL 2022 Chetan Sakaria: ఐపీఎల్​ 2021లో అరంగ్రేటం చేసిన యువ పేసర్​ చేతన్​ సకారియా తన బౌలింగ్​తో అందరినీ ఆకట్టుకున్నాడు. గత సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​ తరఫున ఆడిన అతడు 14 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు. ఇక, ఈ ఏడాది మెగా వేలంలో అతడిని దిల్లీ క్యాపిటల్స్​ రూ. 4.2 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్​లో ధోనీని క్లీన్​ బౌల్డ్​ చేసిన చేతన్.. ఈ ఏడాది విరాట్​ కోహ్లీ వికెట్​ తీయడమే తన టార్గెట్​ అని తెలిపాడు.

chetan
చేతన్​ సకారియా

"ఐపీఎల్ 2021 సీజన్‌లో ధోనీ వికెట్ తీయడం నా బెస్ట్ మూమెంట్. పంజాబ్ కింగ్స్‌తో నేను ఆడిన నా మొదటి ఐపీఎల్ మ్యాచ్ కూడా చాలా స్పెషలే. ధోనీని క్లీన్ బౌల్డ్ చేయడం చాలా అద్భుతమైన ఫీలింగ్. నెట్స్‌లో నేను ఏబీ డివిలియర్స్‌కు కూడా బౌలింగ్ చేశాను. ఏబీడీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఆయన అన్ని రకాల షాట్స్ ఆడగలరు. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు. కాబట్టి ఏబీని ఔట్​ చేయాలనే నా కల తీరదు. అందుకే నా నెక్ట్స్ టార్గెట్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ భాయ్ వికెట్ తీయడమే నా ముందున్న లక్ష్యం."

- చేతన్ సకారియా

ఈ నెల 26న ఐపీఎల్​ 15వ సీజన్​ ప్రారంభం కానుంది. కొత్తగా చేరిన రెండు జట్లుతో మొత్తం పది జట్లు తలపడనున్నాయి. పది జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచులు నిర్వహించనున్నారు. దిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ వేర్వేరు గ్రూపుల్లో ఉండడం వల్ల ఈ రెండు జట్ల మధ్య లీగ్ స్టేజ్‌లో ఒకే మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 16న వాంఖడే స్టేడియంలో ఆర్‌సీబీ, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఇదీ చదవండి: మరో ఐపీఎల్​ వేటలో 'హిట్​మ్యాన్​', 'మిస్టర్​ కూల్'​.. ప్రాక్టీస్​ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.