ETV Bharat / sports

ఐపీఎల్​ వాయిదాకు 'ప్రాక్టీస్ సెషన్లే' కారణమా? - ఐపీఎల్​ వాయిదాకు 'ప్రాక్టీస్ సెషన్లే' కారణమా?

కరోనా కారణంగా ఐపీఎల్​ వాయిదా పడి వారం కావొస్తుంది. అయితే బయో బబుల్​లోకి కొవిడ్​ ఎలా ప్రవేశించిందనేదే అసలైన ప్రశ్న. మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్​ నెట్స్ లేని కారణంగా ఇతర మైదానంలో సాధన చేశారు క్రికెటర్లు. దీని ద్వారానే ఆటగాళ్లు వైరస్ బారిన పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ​

ఐపీఎల్​ వాయిదాకు 'ప్రాక్టీస్ సెషన్లే' కారణమా?

author img

By

Published : May 11, 2021, 8:08 AM IST

బయో బబుల్‌ లోపల కరోనా కేసులు బయటపడటం వల్ల ఐపీఎల్‌ ఆగిపోయి వారం కావస్తోంది. అయితే బబుల్‌ లోపలికి కరోనా ఎలా ప్రవేశించిందన్న విషయంలో రకరకాల సూత్రీకరణలు వినిపిస్తున్నాయి. కానీ.. కచ్చితమైన కారణం తెలియడం లేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి స్కానింగ్‌ కోసం బయటికి వెళ్లి వచ్చినపుడు కరోనాను మోసుకొచ్చాడని, అతను నేరుగా సహచరులను కలవడం వల్లే ఆ జట్టులో వైరస్‌ వ్యాప్తి జరిగిందనే వార్తలొచ్చాయి. అది నిజమే అనుకుంటే చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లలో పాజిటివ్‌ కేసులు ఎలా బయటపడ్డాయన్నది ప్రశ్న. చెన్నై, ముంబయిల్లో మ్యాచ్‌లు ముగిశాక ఆటగాళ్లు రెండో దశ మ్యాచ్‌ల కోసం దిల్లీ, అహ్మదాబాద్‌లకు విమాన ప్రయాణాలు చేయడానికి తోడు.. ఈ రెండు నగరాల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన స్టేడియాల్లో నాలుగు జట్లకు సరిపడా ప్రాక్టీస్‌ సదుపాయాలు లేకపోవడం వైరస్‌ వ్యాప్తికి పరోక్ష కారణాలన్న వాదన వినిపిస్తోంది.

కొత్తగా పునర్నిర్మితమైన మొతేరా స్టేడియంలో ప్రాక్టీస్‌ నెట్స్‌ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. దీంతో నైట్‌రైడర్స్‌ సహా కొన్ని జట్లు అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ కాలేజ్‌ గ్రౌండ్‌కు వెళ్లి సాధన చేశాయి. ఇక దిల్లీలోని కోట్లా స్టేడియంలో నెట్స్‌ సరిపోక రద్దీ ప్రాంతంలో ఉండే రోషనారా మైదానానికి సాధన కోసం చెన్నై సహా కొన్ని జట్లు వెళ్లాయి. అక్కడి సిబ్బందిలో ఎవరూ బబుల్‌ పరిధిలో లేరు. వారికి కరోనా పరీక్షలేమీ నిర్వహించలేదని తెలుస్తోంది. ఈ మైదానాలకు వెళ్లి వచ్చే క్రమంలో, సాధన చేసేటపుడు వస్తువుల వినియోగం లేదా గాలి ద్వారా కరోనా వ్యాపించే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి బబుల్‌లోకి కరోనా ప్రవేశానికి పరోక్షంగా ప్రాక్టీసే కారణమని, అదే లీగ్‌ కొంపముంచిందని అంటున్నారు.

ఇదీ చదవండి: 'మిగతా ఐపీఎల్‌ మ్యాచ్​లు భారత్‌లో జరగవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.