ETV Bharat / sports

అలా చేస్తే ఆశ్చర్యపడను: గంభీర్ - ధోనీ కెప్టెన్సీపై గంభీర్ కామెంట్

వచ్చే సీజన్​లోనూ చెన్నై సూపర్ కింగ్స్​ ధోనీనీ కెప్టెన్​గా కొనసాగిస్తే ఆశ్చర్యపడనని అన్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. సీఎస్కే కోసం మహీ ఎంతో చేశాడని గుర్తు చేశాడు.

Wont be surprised if Chennai continue with Dhoni as their captain saya Gambhir
అలా చేస్తే ఆశ్చర్యపడను: గంభీర్
author img

By

Published : Oct 30, 2020, 10:58 AM IST

రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం మహేంద్రసింగ్‌ ధోనినే కెప్టెన్‌గా కొనసాగిస్తే ఆశ్చర్యపడనని భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. సీఎస్కేకు కెప్టెన్సీ చేస్తున్నపుడు ధోనీ నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.

"కెప్టెన్‌-యజమానుల మధ్య బలమైన బంధానికి చెన్నై ఉదాహరణ. వాళ్లు ఎంఎస్‌కు ఎంతో స్వేచ్ఛనిచ్చారు.. మరెంతో గౌరవించారు. కాబట్టి ఆడినంత కాలం వాళ్లు అతణ్ని జట్టు కెప్టెన్‌గా కొనసాగిస్తే ఆశ్చర్యపడను. వచ్చే సీజన్లో మహీ కొత్త జట్టుతో బరిలో దిగే అవకాశం ఉంది. చెన్నైకి అతనెంతో చేశాడు. మూడు ఐపీఎల్‌ ట్రోఫీలు సాధించడం వల్ల ధోనీకి చెన్నై యాజమాన్యం ఎంతో విలువ ఇస్తుంది. అతను కూడా తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడేందుకు ప్రయత్నిస్తాడు. సీఎస్‌కేకు కెప్టెన్సీ చేస్తున్నప్పుడు ధోని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటాడు."

-గంభీర్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఇప్పటికే మూడుసార్లు సార్లు ఛాంపియన్​గా నిలిచిన చెన్నై.. ఈ ఏడాది మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. సీజన్​లో ప్లేఆఫ్స్​ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్​ల్లో 5 గెలిచింది. లీగ్​లో తన చివరి మ్యాచ్​ను ఆదివారం పంజాబ్​తో ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.