సన్‌రైజర్స్-నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఆటగాళ్లను మించి అందరి దృష్టినీ ఆకర్షించింది అంపైరే. ముందు ఆ వ్యక్తిని చూసి పురుషుల మ్యాచ్‌లో తొలిసారి మహిళా అంపైర్ బాధ్యతలు నిర్వర్తిస్తోందేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ అక్కడున్నది మహిళ కాదు.. పురుషుడే అని తర్వాత తెలిసింది. ఆ అంపైర్ పేరు.. పశ్చిమ్ పాఠక్. అయితే మహిళల తరహాలో భారీగా పెరిగిన అతడి జట్టు చాతీపైకి వాలిపోవడం వల్ల అమ్మాయిలా కనిపించాడు. పాఠక్ ఫొటోలు, వీడియోలు కాసేపటికే సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడం మొదలుపెట్టాయి.
![Who is Paschim Pathak? The IPL umpire with 'rockstar' hairstyle in SRH vs KKR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9227154_1.jpg)
ఐపీఎల్లో అంపైర్‌గా పశ్చిమ్కిది ఐదో మ్యాచ్. ముంబయికి చెందిన అతను 2009 నుంచి దేశవాళీ క్రికెట్లో అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2 టెస్టులు, 3 వన్డేలకు రిజర్వ్ అంపైర్‌గా వ్యవహరించాడు. 2012లో 2 మహిళల వన్డేలకు అంపైర్‌గా పనిచేశాడు. 2015లో విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా పశ్చిమ్ హెల్మెట్ పెట్టుకుని అంపైరింగ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.