ETV Bharat / sports

ముందు బౌలింగ్​ చేసుంటే బాగుండేది: మోర్గాన్

బుధవారం జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ చేతులో చిత్తుగా ఓడిపోయింది కోల్​కతా నైట్​ రైడర్స్. ఇంత ఘోరంగా పరాభవమవుతామని ఊహించలేదని కోల్​కతా కెప్టెన్​ మోర్గాన్​ వాపోయాడు.

EOIN MORGAN_KKR
ముందు బౌలింగ్​ చేసుంటే బాగుండేది: మోర్గాన్
author img

By

Published : Oct 22, 2020, 5:12 AM IST

మొదటి ఐదు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన కోల్​కతా జట్టుపై విచారం వ్యక్తం చేశాడు ఆ జట్టు కెప్టెన్​ మోర్గాన్. ఇంత ఘోరంగా విఫలమవుతామని అనుకోలేదని అన్నాడు. అబుదాబి వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్​లో కోల్​కతాను చిత్తుగా ఓడించింది కోహ్లీ సేన.

" పిచ్​ పరిస్థితులను చూశాక ముందుగా మేమే బౌలింగ్​ చేసుంటే బాగుండు అనిపించింది. ఆర్సీబీ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఈ ఓటమితో చాలా పాఠాలు నేర్చుకుంటాం. రానున్న మ్యాచ్​ల్లో ఈ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. నరైన్​, రసెల్​ అన్నీ మ్యాచ్​లకు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నా. కనీసం వారి సామర్థ్యంతో సరితూగే ఆల్​ రౌండర్స్ ఉంటే ఫలితం మరోలా ఉంటుంది".

-మోర్గాన్, కోల్​కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్.

ఇదీ చదవండి:ఆ రికార్డు సాధించిన తొలి బౌలర్​గా సిరాజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.