ETV Bharat / sports

'కోహ్లీ మాటలే మంత్రంలా పనిచేశాయి' - ఐపీఎల్ తాజా వార్తలు

ఈ ఏడాది ఐపీఎల్​లో యువ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. వారిలో రాజస్థాన్​ రాయల్స్​ బ్యాట్స్​మన్​ సంజూ శాంసన్ ఒకడు. అయితే, తన ఆటతీరులో వచ్చిన మార్పుకు కోహ్లీ చెప్పిన మాటలే కారణమని అంటున్నాడు​.

Samson
సంజూ శాంసన్​
author img

By

Published : Oct 1, 2020, 8:25 AM IST

ఐపీఎల్‌లో పవర్‌ హిట్టింగ్‌తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ బ్యాట్స్​మన్​ సంజూ శాంసన్‌. గత సీజన్​‌లోనూ కొన్ని మెరుపులు మెరిపించినా ఎప్పుడూ ఇంతలా చెలరేగలేదు. అయితే ప్రస్తుత జోరుకు కారణమేంటో వెల్లడించాడు సంజు. ఓ రోజు జిమ్‌లో కోహ్లీతో జరిపిన సంభాషణ ఆటపట్ల తన దృష్టికోణాన్నే మార్చేసిందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

సంజూ శాంసన్​ ఇంటర్వ్యూ

"నేను భారత జట్టులో ఉన్నప్పుడు ఒక గొప్ప అనుభవం ఎదురైంది. ఓ రోజు విరాట్‌ భాయ్‌తో కలిసి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నా. ఫిట్‌నెస్‌పై అంత కష్టపడడానికి కారణమేంటని అతడ్ని అడిగా. అలాగే ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టా. అప్పుడు కోహ్లీ.. 'సంజు.. నువ్వు ఎంతకాలం క్రికెట్‌ ఆడబోతున్నావు?' అన్నాడు. 'ఇప్పుడు నా వయసు 25. మరో 10 ఏళ్లు ఆడతాను కావొచ్చు' అని చెప్పా. అప్పుడతడు.. 'అయితే ఈ పదేళ్లు క్రికెట్‌ కోసం సర్వస్వం ఇవ్వు. ఆ తర్వాత నువ్వు నీ ఫేవరెట్‌ కేరళ ఆహారం తినొచ్చు. కానీ ఈ పదేళ్ల తర్వాత మాత్రం నువ్వు క్రికెట్‌ ఆడలేవు. అలాంటప్పుడు ఈ పదేళ్లు నీ శక్తినంతా క్రికెట్‌ కోసం ఎందుకు వెచ్చించకూడదు?' అని అన్నాడు. కోహ్లీ మాటలు క్రికెట్‌ పట్ల నా దృక్కోణాన్ని మార్చాయి.

సంజూ శాంసన్​, రాజస్థాన్​ రాయల్స్ క్రికెటర్

ఈ సీజన్​ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన నేపథ్యంలో తిరిగి భారత జట్టుకు ఎంపికయ్యే అవకాశముందా అని అడిగినప్పుడు.. "ఎంపిక కావొచ్చు, కాకపోవచ్చు. కచ్చితంగా చెప్పలేను. నేనాడే జట్టును గెలిపించాలన్నదే నా కల. ఇప్పుడే అదే జరుగుతోంది. ఇప్పుడు నేను ఐపీఎల్‌పై మాత్రమే దృష్టిపెట్టడం మంచిది." అని పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.