ETV Bharat / sports

అప్పుడు ధోనీ.. ఇప్పుడు కోహ్లీ - rcb vs sunrisers

ఐపీఎల్​లో ఒకే బౌలర్​ చేతిలో అత్యధికంగా ఏడుసార్లు ఔటైన(సందీప్ శర్మ బౌలింగ్​లో) బ్యాట్స్​మెన్​గా కోహ్లీ నిలిచాడు. అంతకు ముందు ధోనీని ఏడుసార్లు ఔట్ చేసిన జహీర్​ఖాన్ పేరిట ఈ రికార్డు ఉంది.

virat kohli falls to sandeep sharma for record seventh time in ipl
కోహ్లీని ఏడుసార్లు ఎదురు దెబ్బ తీసిన సందీప్ శర్మ
author img

By

Published : Nov 1, 2020, 10:34 AM IST

అబుదాబి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్​లో బెంగళూరు​పై హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో​ ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీని సన్​రైజర్స్​ పేసర్​ సందీప్ శర్మ మరోసారి బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్​తో కలిపి ​ఇప్పటికీ ఏడు సార్లు కోహ్లీని పెవీలియన్​ చేర్చాడు.

ఐపీఎల్​లో సందీప్​ శర్మతో ఆడిన 12 మ్యాచుల్లో కోహ్లీ, ఇప్పటివరకు 68 పరుగుల మాత్రమే చేయగలిగాడు. అయితే విరాట్​ వికెట్​ తీయడం తనకు ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని అంటున్నాడు ఈ పేసర్​.

శనివారం జరిగిన మ్యాచ్​లో ఏడు బంతులు ఆడి ఏడు పరుగులు మాత్రమే కోహ్లీ చేయగలిగాడు. శర్మ వేసిన ఔట్​స్వింగర్​ను ఎదుర్కొన్న కోహ్లీ.. విలియమ్స్​న్​ చేతికి చిక్కి ఔటయ్యాడు. ఒకే బౌలర్​ చేతిలో ఏడుసార్లు ఔట్​ అయిన వ్యక్తిగా అంతకుముందు ధోనీ ఉన్నాడు. జహీర్​ ఖాన్​ చేతిలో ఏడుసార్లు పెవిలియన్​ చేరాడు మహీ.

ఇదీ చూడండి:ప్లేఆఫ్స్​ కోసం పంజాబ్​.. పరువు నిలుపుకోవాలని చెన్నై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.